‘అర్జున్ రెడ్డి’ కొత్త రికార్డ్స్ వింటే అవాక్కవుతారు!

uSJg945

ఒకే ఒక పోస్టర్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అర్జున్ రెడ్డి కి రోజు రోజుకి పెరుతున్న క్రేజ్ చూస్తుంటే ఈ ఇయర్ బ్లాక్ బస్టర్స్ లో టాప్ -5 లో ప్లేస్ దక్కించుకునేలా కనిపిస్తుంది.ఇప్పటికే చాలా సెంటర్స్ లో వారం వరకు అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయంటే అర్జున్ రెడ్డి మేనియా ఎంతలా పెరిగిపోయిందో అర్ధం అవుతుంది.అబ్రాడ్ లో సైతం అలవోకగా మిలియన్ మార్క్ అందుకుని టు మిలియన్స్ వైపు పరుగుతీస్తున్న అర్జున్ రెడ్డి మిగతా మీడియాలో కూడా రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు.ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది.రెండుకోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ని ఏకంగా కోటి అరవై లక్షలు చెల్లించి దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్.పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అని సెలబ్రిటీలంతా ట్విట్టర్ లో పొగిడెయ్యడంతో ఈ సినిమాకి వేరే ఇండస్ట్రీ ల నుండి రీమేక్ హక్కులకు పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.అయితే తమిళ్ రీమేక్ హక్కులను టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన ధనుష్ దక్కించుకున్నాడు.

అయితే ఈ సినిమాలో ధనుష్ నటిస్తాడా లేక కేవలం ప్రొడ్యూస్ చేస్తాడా అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.ఇప్పటికే కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ టాగ్ అందుకున్న అర్జున్ రెడ్డి సాటిలైట్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఉంది.చాలా మంది ఫ్యాన్సీ అమౌంట్స్ ఆఫర్ చేస్తన్నారు.ఇక బాలీవుడ్ నుండి కూడా ఈ సినిమా కొనడానికి టాక్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది.కాకపోతే ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా మారిన విజయ్ దేవరకొండ లా పెర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ దొరక్కపోతే మాత్రం ఇది ఒక బూతు సినిమాగా మిగిలిపోతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది.మొత్తానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ చెప్పిన్నట్టు ఈ సినిమా అక్షరాలా బ్లాక్ బస్టర్ అయ్యి సినిమా యూనిట్ తలరాతల్ని మార్చేస్తుంది. 

Categories: గాసిప్స్

Tags: ,

Leave A Reply

Your email address will not be published.