‘జై లవకుశ’కి లైన్ క్లియర్ !!

జై లవకుశ‘ టీజర్ తోనే మిలియన్స్ కొద్దీ మైలేజ్ తెచ్చుకున్న ఈ సినిమా లో జై క్యారెక్టర్ కాపీ అంటూ జరిగిన రచ్చకి, చర్చకి తెరపడింది. తెరవెనుక ఉంది ఛార్మి నడిపిన వ్యవహారంగా చెప్పుకుంటున్న ఈ ఎపిసోడ్ లో నిజం ఎంతో, అబద్దం ఎంతో ఎవరికీ తెలియదు.కానీ పూరి, ఎన్టీఆర్ మీట్ అయి ఈ విషయం పై డిస్కస్ చేసారని, మ్యూచవల్ అండర్ స్టాండింగ్ తో ఈ కాపీ ఇష్యూ కి ఫుల్ స్టాప్ పెట్టారని టాక్ నడుస్తుంది. అయితే నిజానికి పూరి అనుకున్న క్యారెక్టర్ లో కేవలం హీరోకి నత్తి అని మాత్రమే మెన్షన్ చేసాడట.అది ఈ సినిమాలో ఉండడం అనుకుని చేసింది కాకపోయినా అనవసరంగా పంచాయితీ లు ఎందుకని ఎన్టీఆర్, పూరికి ఒక సినిమా చేస్తానని ఆఫర్ ఇచ్చాడట. దాంతో సంతృప్తి అయిన పూరి కూడా హాపీ గా ఫీల్ అయ్యాడట.

మరో పక్క బాబీ మాత్రం ఇది తన ఒరిగినల్ స్టోరీ అని,ఎవరి దగ్గర కొట్టేయ్యలేదని ఘాటుగానే సమాధానం ఇచ్చాడు.ఏది ఏమైనా జై లవకుశ తెచ్చిన హైప్ ని కాపాడుకోవడానికి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. సినిమా కంటే ఏది ముఖ్యం కాదని ఈ ఇన్సిడెంట్ ద్వారా ప్రూవ్ చేసాడు. ఈ టీజర్ కు పవన్ అభిమానుల నుండి హ్యుజ్ సపోర్ట్ వచ్చింది. అందుకే ఇప్పడు అంతా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు ఎన్టీఆర్ అంటూ ఓ పొగిడేస్తున్నారు.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.