ఓవర్సీస్ అమ్మకాల్లో ‘స్పైడర్’ రికార్డ్ !!

01112

రోజుకి రోజుకి అంచనాలు పెంచుకుంటూ దూసుకుపోతున్న మహేష్ బాబు స్టారర్ స్పైడర్ రిలీజ్ కి ముందే రికార్డ్స్ ఎన్నింటినో తన పేరు రాసుకుంటూ, ఫుల్ క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ సునామి సృష్టించడానికి వస్తుంది. ఈ సినిమాలో మహేష్ తో పాటు గోల్డెన్ గర్ల్ రకుల్ కూడా ఒక రేంజ్ లో రెచ్చిపోయి మరీ ఆడిపాడిందని టాక్. ఇక మురుగదాస్ స్పెషల్ గా కాన్సెన్ట్రేట్ చేసి తీసిన ఫైట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. వీటన్నిటితో క్రియేట్ బజ్ తో స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో కళ్ళు తిరిగే రేంజ్ లో జరుగుతుంది. లేట్ అయితే రైట్స్ దక్కవని కనీసం ఒక్క సింగిల్ కూడా రాకుండనే రైట్స్ కోసం క్యూ కడుతున్నారు. మహేష్ ఇంతకుముందు చేసిన బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయినా కూడా స్పైడర్ బిజినెస్ పై 1 పర్సెంట్ కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ కనిపించడంలేదు.

తెలుగు రాష్ట్రాల్లో నైజాం తప్ప మిగతా ఏరియాల్లో జై లవకుశ స్పైడర్ కి గట్టి పోటీ ఇచ్చింది. కొన్ని చోట్ల ఆ సినిమాకే కొంచెం ఎక్కువఇచ్చిమరీ కొనుక్కున్నారు. ఎన్టీఆర్ వరుసహిట్స్ అందుకోవడం వల్ల ఆ రేంజ్ బిజినెస్ జరిగింది. కానీ ఓవర్సీస్ బిజినెస్ లో మాత్రం తనకు ఎవరు పోటీ రారని నిరూపించుకున్నాడు మహేష్. ఈ సూపర్ స్టార్ నటించిన సినిమా ఎలా ఉన్నా కూడా అక్కడ మిల్లియమ్ మార్క్ గ్యారెంటీ. అందుకే స్పైడర్ కి అదే రేంజ్ లో రేటు ఇచో కొనుక్కున్నారు. ఓవర్సీస్ బిజినెస్ లో  బాహుబలి-2 కంక్లూషన్ తరువాత స్థానంలో నిలిచింది స్పైడర్. ఈ సినిమాలో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఫేమస్ అయిన  డైరెక్టర్ ఎస్.జె.సూర్య,హీరో భరత్ లో విలన్స్ గా కనిపించనున్నారు.సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ తో పాటు హారిస్ జై రాజ్ మ్యూజిక్ సైడర్ కి మేజర్ అట్రాక్షన్స్ గా నిలవనున్నాయి. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది.

Categories: గాసిప్స్

Leave A Reply

Your email address will not be published.