కథని నమ్ముతున్న కథానాయకుడా విజయోస్తు : కేశవ సినిమా స్టోరీ | సినిమా కథలపై స్పెషల్ స్టోరీ.

కేశవ

నిఖిల్ తన ప్రతి సినిమాకి చూపిస్తున్న వైవిద్యం మనం చుస్తునాం. హీరో పాత్ర కంటే ఎక్కువగా కథనే నమ్ముతూ వస్తున్నారు నిఖిల్. నిజానికి కథను మాత్రమే నమ్మి సినిమా చేయడం ఇప్పటిది కాదు గతంలో చాల మంది నటులు ఇలా కథను నమ్మి సినిమాలు చేసేవారు. అలా చేసిన సినిమాలు ఇప్పుడు మనం చూస్తున్నసినిమాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. కథను మాత్రమే నమ్మిన ప్రతి సారి నిఖిల్ కు విజయాలు వస్తున్నాయి. అలంటి కథతోనే ‘కేశవ’ అంటూ మళ్లి మన ముందుకు వస్తున్నారు నిఖిల్.

కేశవ సినిమా స్టోరీ : ఈ సినిమా ట్రైలర్ లోని కొన్ని డైలాగ్స్ ను బట్టి చూస్తే సినిమా కథ ఇలా ఉండొచ్చు.
గొప్పగా కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు..బాధ:
గొప్పగా కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు..బాధ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ఈ డైలాగ్ చూస్తుంటే సినిమాలో తనకు జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకునే పాత్రలో నిఖిల్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. గొప్పగా కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు..బాధ అని అంటూనే చాల కొత్తగా చెప్పాడు దర్శకుడు సుదీర్ వర్మ.

ఎడమ వైపు ఉండాల్సిన గుండె నాకు కుడి వైపు ఉంది:
ఎడమ వైపు ఉండాల్సిన గుండె నాకు కుడి వైపు ఉంది, ఎక్కువ భయపడిన…ఎక్కువ కంగారు పడిన చనిపోతాను అన్న ఈ డైలాగ్స్ తో స్టోరీ మొత్తం తెలివిగా రివీల్ చేసాడు డైరెక్టర్ మెయిన్ గా ఈ సినిమా ఒక హెల్త్ ప్రాబ్లెమ్ ఉన్న యువకుడు ఎంత తెలివిగా తన రివెంజ్ ను తీర్చుకున్నాడు అనే థీమ్ లైన్ హైలైట్ చేసి ఈ సినిమాను తీర్చిదిద్దారనిపిస్తుంది.

ఏం చేసిన ప్రశాంతంగా చేయాలి…మర్డర్ తో సహా:
గుండె కుడి వైపు ఉండటం వంటి ఒక వింత సమస్య ఉన్న యువకుడు తనకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసిన ప్రశాంతంగా చేయాలి…మర్డర్ తో సహా అనే డైలాగ్ నిఖిల్ తో చెప్పించారనిపిస్తుంది.

ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడి వైపు ఉన్న ఒక యువకుడు తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంటాడు. అసలు తనకు జరిగిన అన్యాయం ఏంటి?. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సినిమా చూస్తేనే సమాధానం దొరుకుతుంది. ఈ నెల 19 తేదీన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.
మొత్తం గా స్టోరీ థీమ్ మాత్రం చాల కొత్తగా నిఖిల్ మరియు సుదీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమాకు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో ఇషా కొప్పికర్ పోలీస్ క్యారెక్టర్ చేయడం సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. పోలీస్ క్యారెక్టర్ పాత్ర కోసం ఇషా కొప్పికర్ ను తీసుకోవడంతో సుదీర్ వర్మ కథకి బలాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. సన్నీ మ్యూజిక్ బాగుంది ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోస్తాయి.

చివరి మాట : నిఖిల్ మళ్లి ఒక ప్రయోగాత్మక చిత్రంతో అలరించడానికి మన ముందుకు వస్తున్నారు.
!…కథని నమ్ముతున్న కథానాయకునికి మా ఫిలింఈవెంట్స్ తరపున ప్రత్యేక అభినందనలు…!

Categories: Uncategorized

Tags: ,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.