కొత్త సాంగ్ తో ‘నేనే రాజు నేనే మంత్రి’ కి రెట్టింపయిన క్రేజ్ !!

0111

బాహుబలితో ఇంటర్నేషనల్ ఇమేజ్ సంపాదించుకున్న రానా దగ్గుబాటి హీరో గా వస్తున్న సినిమా.నేనే రాజు..నేనే మంత్రి….ఈ సినిమాకి తేజ దర్శకుడు.ప్రస్తుతం పూర్ ఫామ్ లో ఉన్న తేజ కి ఈ సినిమా ఇవ్వడమే ఒక వింత అనుకుంటే ఈ సినిమాని తేజ తెరకెక్కించిన విధానం ఇంకా షాకింగ్ గా ఉంది.ఈ సినిమా లో భారీతనం గాని,కమర్షియల్ ఎలిమెంట్స్ గాని,భారీ కాస్టింగ్ గాని ఇంతకుముందెన్నడూ తేజ సినిమాల్లో మచ్చుకు కూడా కనిపించని రేంజ్ లో ఉంది.అలాగే రానా,కాజల్ ల మధ్య రొమాన్స్ ని కూడా కొంచెం గాఢత పెంచి ఘాటుగానే ప్రెజెంట్ చేసాడు. తేజ ఇప్పడు ఉన్న స్టేజ్ లో కలలో కూడా ఊహంచని ఈ అవకాశం రావడంతో తన మూసపద్ధతుల్నీ పూర్తిగా పక్కనబెట్టి కమర్షియాలిటీ మంత్రాన్ని జపిస్తూ,కథలో నావెల్టీ పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.

డు ఆర్ డై లా మారిన ఈ ప్రాజెక్ట్ కోసం సినిమా ఇండస్ట్రీ లో తనకున్న అనుభవాన్ని వాడుతూ తనకు తెలిసిన అన్ని అస్త్రాలను పదునుపెట్టి మరీ సందిస్తున్నాడు. పైగా ఈ సినిమా తమిళ్ లో కూడా విడుదలవుతుండడం,అక్కడ కూడా తీసుకొవడం బోనస్.రీసెంట్ గా రిలీజ్ అయిన జోగేంద్ర వన్ మినిట్ సాంగ్ కూడా స్టన్నింగ్ గా ఉంది.అందులో విజువల్స్ లేకపోయినా చూపించిన స్టిల్స్ లోనే చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది.రానా లుక్,భారీతనం,కాజల్ ,కేథరిన్ ల గ్లామర్ అన్ని కూడా సినిమాపై అంచానాలు పెంచేలాగానే ఉన్నాయి.ఇక ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డైలమాలో ఉండగా తమిళ్ లో అజిత్ వివేగం డేట్ మార్చుకోవడంతో ఆగస్టు 11 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది నేనే రాజు…నేనే మంత్రి.

Categories: గాసిప్స్

Leave A Reply

Your email address will not be published.