చిరు – బోయపాటి కాంబినేషన్లో మీరెప్పుడు చూడని మాస్ సినిమా….!

చిరు - బోయపాటి

చిరు – బోయపాటి కాంబినేషన్లో సినిమా వస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ‘ఖైదీ నంబర్-150’ సినిమాతో తన అభిమానులనే కాకా సినీ అభిమానులను సైతం అలరించారు మన మెగా స్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రం వెంటనే ప్రారంభం అవుతుందని అంత భావించారు. కానీ చిరు ఇప్పటి వరకు తన సినిమాను మొదలు పెట్టలేదు.

ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు చిరు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ చిత్రం మొదలు కాకా ముందే ‘చిరు152’ సినిమా తెరపైకి వచ్చింది. చిరు – బోయపాటి కాంబినేషన్లో సినిమా ఉంటుందని స్వయంగా అల్లు అరవింద్ ప్రకటించడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ మెగా స్టార్ గతంలో చేయని ఒక మాస్ క్యారెక్టర్ తో సినిమా స్టోరీ రాసారట బోయపాటి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తారట.

Categories: గాసిప్స్

Tags: ,,,,

Leave A Reply

Your email address will not be published.