జగపతి బాబు ‘పటేల్ సార్’ మూవీ రివ్యూ.!!

'పటేల్ సార్' మూవీ రివ్యూ

జగపతి బాబు ‘పటేల్ సార్’ మూవీ రివ్యూ:

జగపతి బాబు ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘పటేల్ సార్‘. ఆయన చాల రోజుల తర్వాత పూర్తి స్థాయి హీరోగా  నటించిన సినిమా కావున అందరిలోనూ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సరికొత్త కథాంశం తో వస్తున్న ఈ సినిమాలో పద్మప్రియ హీరోయిన్ గా నటిస్తుండగా వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం సినిమా ఎలా ఉందొ.

కథ:
దేశంలో తన తమ్ముడు తయారు చేసిన డ్రగ్స్ ని భారీగా సరఫరా చేయాలనీ చూస్తాడు దేవరాజు అలియాస్ డిఆర్ (కబీర్ సింగ్). ఇక రిటైర్డ్ ఆర్మీ మేనేజర్ అయినా సుభాష్ పటేల్ (జగపతి బాబు) డిఆర్ గ్యాంగ్ మెంబర్స్ ని ఒక్కొక్కరిగా చంపుతూ వస్తాడు. ఇక ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలియక మినిస్టర్ పాపారావు (రఘు బాబు) తో కలిసి కేథరిన్(తాన్యా హూప్) పోలిష్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్ గా నియమిస్తారు.

ఇక సుభాష్ పటేల్ ఒక వైపు హత్యలు చేస్తూనే ఒక కళ్ళు లేని పాపతో తో కలిసి ఒకే ఇంట్లో ఉంటాడు. ఎవ్వరికి తెలియకుండా హత్యలు చేస్తూనే పాప కంటి చూపు తెప్పిచాలని హాస్పిటల్ కి వెళ్తాడు. కాగా ఎన్ని హత్యలు జరుగుతున్న డిఆర్ మాత్రం దేశంలో డ్రాగ్ ను విస్తరించాలని తన సన్నిహితులు మౌంటి(పృద్వి), చోర్ బజార్ లాలా(ప్రభాకర్) తో కలిసి భారీ ప్లాన్ వేస్తాడు. అయితే పటేల్ కి వీరికి సంబంధం ఏంటి?, అసలు ఆ పాప ఎవరు?, చివరికి కథ ఎలా ముగిసింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
జగపతి బాబు సుభాష్ పటేల్ గా తన నటన విశ్వరూపాన్ని చూపించారు. కాగా ఆయన ఏ పాత్ర చేసిన ఆ పాత్రకు తగ్గట్టుగా గెటప్పు మరియు డైలాగ్ డెలివెరి మార్చుకుంటూ వస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో కూడా జగపతి బాబు పాత్ర చాల కొత్తగా ఉంటుంది. ఇక దేవరాజు పాత్ర చేసిన కబీర్ సింగ్ కూడా తన దైన శైలిలో ఆకట్టుకుంటాడు. ఇకపోతే లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్గా తాన్యా హూప్ నటన బాగుంది. ఇక సినిమాలోని రఘు బాబు, ప్రభాకర్ వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

ప్లస్ పాయింట్స్:
సుభాష్ పాత్రలో జగపతి బాబు నటన
కొన్ని ఎమోషన్ సన్నివేశాలు
దర్శకుడు కథ చెప్పిన విధానం

మైనస్ పాయింట్స్:
రెగ్యులర్ రివెంజ్ డ్రామా

మొత్తంగా చెప్పాలంటే:
మొత్తంగా చెప్పాలంటే చాల రోజుల తర్వాత జగపతి బాబు హీరోగా చేసిన సినిమా కాబట్టి అందరిలోనూ సినిమాపై ఆసక్తి కలిగింది. అయితే ఆసక్తితోనే సినిమాకి వెళ్లేవారికి ఏ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా జగపతి బాబు నటన అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఎప్పుడు మూస ధోరణి ఉండే సినిమాలు వస్తున్నాయి కొత్త సినిమాలు రావడం లేదు అనుకునే వారికీ ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది.

టాగ్ లైన్: పటేల్ సార్ – ఒక మంచి ప్రయత్నం.
ఫిల్మిఈవెంట్స్ రేటింగ్: 3/5

Categories: రివ్యూ

Tags: ,,,

Leave A Reply

Your email address will not be published.