‘జయ జానకి నాయక’ మూవీ జెన్యూన్ రివ్యూ !!

jaya article_Thumbnail_V1

‘జయ జానకి నాయక’ మూవీ రివ్యూ :

విడుదల తేదీ: 08/11/2017
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్, జగపతి బాబు, శరత్ కుమార్,నందు 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన జయ జానకి నాయక సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పించే బోయపాటి దర్శకత్వం లో సినిమా అనగానే ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. కాగా చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ లుక్స్, రకుల్ ప్రీత్ సింగ్ పెర్ఫామెన్స్ చూసి సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం సినిమా ఎలా ఉందొ.

కథ:
చక్రవర్తి(శరత్ కుమార్) కి ఇద్దరు కొడుకులైన గగన్(బెల్లంకొండ సాయి శ్రీనివాస్), అన్నయ (నందు) అందరూ కలిసి ఆనందంగా గడుపుతూ ఉంటారు. కాగా గగన్ స్వీటీ ని చూసి లవ్ లో పడతాడు. స్వీటీ కూడా గగన్ ని ప్రేమిస్తుంది. అయితే వీరి ప్రేమ ఆలా కొనసాగుతున్న తరుణంలో స్వీటీ (రకుల్ ప్రీత్ సింగ్) అనుకోని ప్రమాదంలో పడుతుంది. అయితే తన ప్రేయసి ప్రమాదంలో ఉందని తెలిసి గగన్ ఎం చేసాడు?, అసలు జయ జానకి నాయక సినిమా పేరు కి జస్టిఫికేషన్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు:
ఇక నటి నటుల విషయానికి వస్తే క్లాస్ గా కనిపించే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో పూర్తిగా మాస్ ఆక్షన్ తో మెప్పించే ప్రయత్నం చేసాడు. కాగా కేవలం మాస్ సినిమాలతోనే బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అందుకుంటున్న బోయపాటి ఈ సినిమాని కూడా అదే తరహాలో తెరకెక్కించి మరో విజయాన్ని తన కథలో వేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారని తెలుస్తుంది. ఇక స్వీటీ పాత్రలో ఎప్పటి లగే రకుల్ తన నటనతో అందరిని అలరించిందని చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ లో రకుల్ తో ఎక్కువగా ఏడిపించే సన్నివేశాలతో బోయపాటి కొంత ఇబ్బంది పడేల ఉంటుంది. శరత్ కుమార్, జగపతి బాబు, నందు వారి వారి పాత్రలకు న్యాయం చేస్తూ బాగానే నటించినప్పటికీ ఎక్కడో పూర్తి స్థాయిలో వారి నటన బయటకి రాలేదని అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:
సినిమా సాంకేతిక వర్గం విషయానికి వస్తే మాస్ సినిమాలతో బోయపాటి శ్రీను ప్రతి సారి లాగే ఈ సరి కూడా అలరించడానికి ప్రయత్నించాడు. కానీ భారీ తారాగణం ఉన్న వారి నటనను పూర్తి స్తాయిలో ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రేంజులో ఇవ్వడంతో సినిమాకి కాస్త బలం చేకూరింది. కాగా రిషి పంజాబీ అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమా ప్రధానంగా బలంగా నిలిచాయి. అయితే విసువల్ పరంగా సినిమా బాగా రావడానికి రిషి పంజాబీ పూర్తి స్థాయిలో పని చేసాడనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
రిషి పంజాబీ అందించిన సినిమాటోగ్రఫీ
దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం
ఆక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
నటీనటుల నుండి పూర్తి స్తాయి నటనను రాబట్టుకోలేక పోవడం.
విశ్లేషణ:
పూర్తి మాస్ సినిమాలని ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా అమితంగా నచ్చుతుంది. పూర్తి స్థాయిలో బోయపాటి మార్క్ ఉన్న ఈ సినిమాగా తెరకెక్కింది. కాగా మాస్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడే వారు ఈ సినిమా ఖచ్చింతంగా చూడాల్సిందే. ముఖ్యంగా రామ్, లక్ష్మణ్ అందించిన ఫైట్స్ మాత్రం ఒక రెజులో ఉన్నాయి. ఈ వీకెండ్ మాస్ సినిమా చూడాలని అనిపిస్తే మాత్రం ఈ చిత్రం తప్పకుండ చూడాల్సిందే.

ఫిల్మిఈవెంట్స్ రేటింగ్ : 3/5

Categories: రివ్యూ

Tags: ,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.