‘జెంటిల్ మన్’కి అందాల సపోర్ట్ ఇస్తున్న హీరోయిన్.!!

జెంటిల్ మన్‘ ఇప్పటివరకు ఈ పేరుతో దాదాపు అన్ని భాషల్లో సినిమా వచ్చేసింది. ఇప్పుడు రీసెంట్ గా ఏ జెంటిల్ మన్ పేరుతో బాలీవుడ్ లో ఒక సినిమా రెడీ అయింది. మొన్నటివరకు ఎక్కడా ఈ సినిమా పేరు వినిపించలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారిపోయింది ఈ సినిమా. ముఖ్యంగా సిద్దార్థ్ మల్హోత్రా, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ల మధ్య పండిన కెమిస్ట్రీ గురించి బి టౌన్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో జాక్వెలిన్ మరీ హాట్ గా కనిపిస్తుంది.

ఇక ఈ రేంజ్ కెమిస్ట్రీ పడడానికి కారణం వీళ్లిద్దరి మధ్య రియల్ లైఫ్ లో జరుగుతున్న సంథింగ్ సంథింగ్ అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో రెండు క్యారెక్టర్స్ లో సిద్దార్థ్ చేసిన ఫైట్స్ కి ఎంత క్రేజ్ ఏర్పడిందో హీరోయిన్ తో చేసిన రొమాన్స్ తో కూడా అంతే క్రేజ్ ఏర్పడింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ జాక్వెలిన్ కేవలం గ్లామర్ షో కి మాత్రమే పరిమితం కాలేదు.

గన్స్ పట్టుకుని ఫైరింగ్ కూడా చేసింది.రాజ్,డి.కె కలిసి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాన్సెప్ట్ పాతదే అయినా టేకింగ్,ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందట.అందుకే ట్రైలర్ లోనే మొత్తం కథ చెప్పేసారు. ఇక ఈ సినిమాని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఆగస్టు 25 న రీలీజ్ అవుతున్నఈ సినిమాకి రూమర్స్ తోనే బోలెడంత బోల్డ్ పబ్లిసిటీ తెచ్చారు సిద్దార్థ్ అండ్ జాక్వెలిన్. వాళ్ళ సిజ్లింగ్ కెమిస్ట్రీ, ఆన్ స్క్రీన్ రొమాన్స్ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

Categories: గాసిప్స్

Tags: ,,,,,

Leave A Reply

Your email address will not be published.