‘జైలవకుశ’ ఎక్సక్లూసివ్ డిటైల్స్!

1 (1)-min

ఎన్టీఆర్ ఫస్ట్ టైం మూడు పాత్రల్లో నట విశ్వరూపాన్ని చూపించబోతున్న సినిమా జైలవకుశ. పైగా ఈ జెనరేషన్ హీరోస్ ఎవరూ కూడా సాహసించని నెగెటివ్ క్యారెక్టర్ కూడా చేస్తూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాడు. ఈ సినిమా మొత్తానికి కావాల్సిన, రావాల్సిన బజ్ ని ఒకే ఒక్క టీజర్ తో సంపాదించిన ఘనత కూడా ఎన్టీఆర్ సొంతం.అయితే మిగతా రెండు పాత్రల్లో కూడా ఇప్పటివరకు చెయ్యని కొత్త క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు జైలవకుశ గురించి చాలా మందికి తెలిసిన విషయాలు, విశేషాలు ఇవే.అయితే ఇప్పడు మాత్రం ఆడియో తో కొత్త షాకిచ్చాడు ఎన్టీఆర్. ఆడియో లో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయి. నిన్నమొన్నటివరకు తమన్నా లేదా రకుల్ ఐటెం సాంగ్ చేస్తారంటూ వచ్చిన వార్తలు కూడా పుకార్లని తేలిపోయింది. సినిమా మొత్తానికి లవ క్యారెక్టర్ మెయిన్ బేస్ అని కూడా హింట్ ఇచ్చారు. సినిమాలో హ్యూమర్ ని పండించడమే కాకుండా ఇద్దరు భామల మధ్య ఇరుక్కున్న కొంటె కృష్ణుడిగా రొమాంటిక్ టచ్ ఇచ్చే బాధ్యత కూడా లవ కుమార్ క్యారెక్టర్ పైనే ఉంచారు. రావణ క్యారెక్టర్ ఉండేది కొంచెం సమయమే అయినా కూడా సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిస్తుందట. ఇక కుశ క్యారెక్టర్ ఒక దొంగ అంటూ సాంగ్ తో కన్వే చేసారు.

ఆ క్యారెక్టర్ సినిమాకి క్లైమాక్స్ లీడ్ ఇస్తుందని యూనిట్ మెంబర్స్ ఇచ్చిన లీక్. అయితే ఒకదానితో ఒకదానికి పోలిక లేని మూడ్ పాత్రలు ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ చేస్తేనే ఒక కిక్ ఉంటుంది.ఇక ఈ మూడు కలవడం, వాటి డ్రైవ్స్,పొంతనలేని తీరు తెన్నులు…..కధలో ఏ మాత్రం విషయం ఉన్నా కూడా సినిమా రేంజ్ అందరూ ఊహించినదానికి పదింతలు ఉంటుంది. ఇంకా థియేట్రికల్ ట్రైలర్ కూడా ఇవ్వకుండానే ఆడియో తో సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన టీమ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవల్స్ ని ప్రూవ్ చేసుకున్నారు. అంటే ట్రైలర్ లో మూడు క్యారెక్టర్స్ ని మిక్స్ చేసి జై టీజర్ లా షాకింగ్ అవుట్ ఫుట్ తో మ్యాజిక్ చేయబోతున్నారన్న మాట. ఇక ఎన్టీఆర్ ఫాన్స్ కి ఆనందాన్ని పంచే న్యూస్ ఏంటంటే ఈ సినిమా యూనిట్ అంతా ఊహించినదానికంటే బాగా వచ్చిందట. ఎన్టీఆర్ కెరీర్ లోనే కాక టాలీవుడ్ హిస్టరీ లో కూడా ఒక స్పెషల్ ఫిలిం గా నిలుస్తుందట.

Categories: గాసిప్స్

Tags: ,,,

Leave A Reply

Your email address will not be published.