‘జై లవ కుశ’ టీజర్ ఫస్ట్ రివ్యూ.!!

‘జై లవ కుశ’ టీజర్ ఫస్ట్ రివ్యూ:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాబినయం చేస్తున్న ఈ సినిమా లో నివేత థామస్, రాశి కన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రధానంగా ఎన్టీఆర్ నటిస్తున్న మూడు పాత్రలు ఈ సినిమాకి హైలెట్ కానున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇందులో కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది.

ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ “ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల…ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రమంత దైర్యం ఉండాలా…ఉందా?” డైలాగ్ చూస్తుంటే సినిమాలో ఎన్ని భారీ డైలోగ్స్ ఉన్నాయో అర్థం అవుతుంది. అలాగే ఎన్టీఆర్ చేస్తున్న ఫైట్ లు చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా ఎన్టీఆర్ సినిమాల్లో మొదటిగా నిలుస్తుందని తెలుస్తుంది.

కానీ ఇక్కడ ఒక ఆసక్తి కరమైన విషయాన్నీ గమనించాలి. సినిమా లోని పాత్రలకు అనుగుణంగా జై పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు. ఇదే తరహాలో మిగిలిన లవ మరియు కుశ పాత్రలు సంబంధించిన టీజర్ లను త్వరలో విడుదల చేస్తారని సమాచారం. ‘జై లవ కుశ’ సినిమాపై మొదటి నుండి అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రావణుని బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘జై లవ కుశ’ టీజర్:

Categories: రివ్యూ

Tags: ,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.