‘జై లవ కుశ’ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది…!

‘జై లవ కుశ’ సినిమాపై మొదటి నుండి అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చూస్తే తన నటన విశ్వరూపాన్ని మళ్లీ చూపించాడని అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా రెండు పోస్టర్లను రిలీజ్ చేసారు. ఇందులో ఒక పోస్టర్లో ఎన్టీఆర్ చేతులకి సంకెళ్లు వేసి ఉండటం ఎన్టీఆర్ ఎవరినో ఉద్దేశించి చేతులు జోడించి దండం పెట్టడం చూస్తుంటే ఈ సినిమాలో భారీ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

JaiLavaKusaFirstLook

Categories: ఫిలిం న్యూస్

Tags: ,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.