‘జై లవ కుశ’ సెకండ్ టీజర్ ఎప్పుడో తెలుసా?

వరుస హిట్స్ తో నెంబర్ 1 చైర్ పై కన్నేసిన ‘ఎన్టీఆర్‘ జనతా గారేజ్ బ్లాక్ బస్టర్ తరువాత చాలా గ్యాప్ తీసుకుని మరీ జై లవకుశ సినిమాని ఓ.కె చేసాడు. అయితే దీనికి డైరెక్టర్ బాబీ అయినా కూడా ఒక్క ఎన్టీఆర్ ఫ్యాక్టర్ తోనే సినిమా షూటింగ్ 10 పర్సెంట్ అవ్వగానే 75 కోట్ల ఆఫర్ వచ్చింది. కానీ దాన్ని కూడా ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. అప్పుడు ఆ నిర్ణయానికి అంతా ఆశ్చర్య పోయినా జై క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ చూసి అది సరియైన నిర్ణయమే అని ఫిక్స్ అయిపోయారు. ఆ టీజర్ లో ఒక్క డైలాగ్ తో ఫ్యానిజాన్ని కూడా దాటి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.

అయితే ఆ హైప్ తో సెకండ్ టీజర్ గురించి అంతా ఎదురు చూస్తున్నారు. కానీ యూనిట్ మాత్రం ఈ సారి  రిలీజ్ చేసే లవకుమార్ టీజర్ తో సినిమా బిజినెస్ మొత్తం ఫినిష్ అయిపోవాలని భావిస్తోందట. ఈ సినిమాతో మినిమమ్ 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాలన్నది టార్గెట్. నిజానికి ఎన్టీఆర్ రేంజ్ కి అది సరయిన మార్కెట్టే. పైగా సినిమాలో అంత కిక్ ఉందని తెలుస్తుంది.

సో, ఈ నెల లాస్ట్ వీక్ లో లవ క్యారెక్టర్ టీజర్ ని పరిచయం చెయ్యాలని అనుకున్నా కూడా ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ పై ఫోకస్ పెట్టిన ఎన్టీఆర్ వచ్చేనెల మొదటి వారంలో ఆ టీజర్ రిలీజ్ చేద్దాం అన్నాడట. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న బిగ్ బాస్ క్లిక్ అయితే అది కూడా ఎన్టీఆర్ మరింత ప్లస్ అవుతుంది. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పేరుని నిలబెట్టుకుంటూ విజయ గర్జనతో బాక్స్ ఆఫీస్ ని  హడలెత్తిస్తున్నాడు.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.