‘డీజే’ ఎఫెక్ట్ తో అలెర్ట్ అయిన చరణ్ !!

ఈ మధ్య దువ్వాడ జగన్నాధం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. కానీ ఆ విషయంలో కూడా ఉన్నదానికంటే ఎక్కువగా చూపించారని టాక్ నడిచింది. అయితే అల్లు అర్జున్ కి ఆ రేంజ్ లో నెగెటివ్ రావడానికి మరో కారణం కూడా అందరికి తెలుసు. ”చెప్పను బ్రదర్” అనే ఒకే ఒక్క మాట చూపించిన ఎఫెక్ట్ మామూలుగా లేదు.

అందుకే ఇప్పడు మెగా  హీరోలెవ్వరూ  కూడా పవన్ అభిమానులను లైట్ తీసుకోవడంలేదు. ఫిదా ఆడియో ఫంక్షన్ లో వరుణ్ ఆచితూచి మాట్లాడడంతోనే ఆ విషయం అర్ధం అవుతుంది. ఇక ఇలాంటి అనుభవమే రామ్ చరణ్ కి కూడా ఎదురయింది. దర్శకుడు ఆడియో ఫంక్షన్ కి వచ్చిన రామ్ చరణ్ కి పవన్ ఫాన్స్ నుండి సేమ్ రియాక్షన్ ఎదురయింది. అయితే చాలా సేపు వాళ్ళ అరుపులు విన్న చరణ్ చివరికి ఒక ఆసక్తికరమయిన సమాధానం చెప్పాడు. తన కుటుంబ సభ్యులు అంటే తనకు ప్రాణమని అది అందరిముందు బయట పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కొంచెం టచింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

సంక్రాంతికి కూడా పవన్ ఇంటికి వెళ్లి మరీ ఫెస్టివల్ స్పెషల్ ఫుడ్ ఇచ్చివచ్చిన చరణ్ కి నిజంగానే పవన్ అంటే ప్రేమ. అందుకే చెప్పను అనే మాట అనకుండా ఇలా చెప్పకుండా దాటేశాడు. మొత్తానికి పవన్ ఫాన్స్ నుండి బన్నీ కి ఎదురయిన రిటార్డ్ తో చెర్రీ కొంచెం అలెర్ట్ అయ్యి అదిరిపోయే ఆన్సర్ తో పవన్ ఫాన్స్ మనసుగెలుచుకున్నాడు.

Categories: గాసిప్స్

Tags: ,

Leave A Reply

Your email address will not be published.