‘నక్షత్రం’ మూవీ రివ్యూ !!

nakshatram

నక్షత్రం మూవీ రివ్యూ:

విడుదల తేదీ: ఆగస్టు 04, 2017
దర్శకత్వం: కృష్ణ వంశీ
నిర్మాతలు: ఏస్ వేణుగోపాల్, కే శ్రీనివాసులు, సజ్జు
సంగీతం: భీమ్స్, హరి గౌరా, భరత్ మధుసూదన్
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నారోజ్
నటీనటులు: సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్, రెజినా, తనీష్, ప్రకాష్ రాజ్

దర్శకుడిగా ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు ‘దర్శకుడు కృష్ణ వంశీ’. అయితే చాల కాలంగా వరుస ప్లాఫ్ సినిమాలతో సతమతమౌతున్న ఆయన చాల రోజులు గ్యాప్ తీసుకొని సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్, రెజినా, తనీష్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటి నటులని పెట్టి ‘నక్షత్రం’ సినిమా చేసారు కృష్ణ వంశీ. కాగా ఈ రోజే(ఆగస్టు 04, 2017) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం.

కథ:

ఇక సినిమా కథ విషయానికి వస్తే డ్రగ్ మాఫియా, పోలీస్ శాఖ నేపథ్యంలో రాసుకున్న కథ. రామారావు (సందీప్ కిషన్) చిన్న తనంలోనే పోలీస్ కావాలని కోరుకుంటాడు. తన తండ్రి స్పూర్తితో ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తాడు. పరశురామయ్య (ప్రకాష్ రాజ్) పోలీస్ కమిషనర్ గా పనిచేస్తూ డ్రగ్ మాఫియాతో లింక్ పెట్టుకుంటాడు. పరశురామయ్య కొడుకు రాహుల్ (తనీష్) కి, రామారావుకు ఒక సందర్భంలో గొడవ జరుగుతుంది. ఈ గొడవ కారణంగా రామారావు చిన్న తనం నుండి కలగన్న పోలీస్ జాబ్ సెలక్షన్ కి వెళ్లలేకపోతాడు. ఇక అలెగ్జాండర్ (సాయి ధరమ్ తేజ్) పాత్రేంటి?, కథలో హీరోయిన్స్ పాత్రేంటి?, చివరికి కథ ఎలా ముగిసిందో తేరా పైనే చూడాలి.
నటీనటుల పనితీరు:

సినిమా మొత్తంలో సందీప్ కిషన్ పాత్ర అందరిని అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశంలోనూ ఆయన అద్భుతంగా నటించాడు. ఇక అలెగ్జాండర్ పాత్ర చేసిన సాయి ధరమ్ తేజ్ కనిపించేది కొద్దిసేపైనా చాల వరకు తన పాత్రకు న్యాయం చేయగలిగాడు. ఇక ప్రకాష్ రాజ్ గురించి చెప్పనవసరం లేదు. ఆయన ఏ పాత్ర చేసిన అందులో ఇమిడి పోతారు. ఈ సినిమాలో కూడా పోలీస్ కమిషనర్ పాత్రలో ఎప్పటిలాగే అలరించాడు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే తమ అందచందాలతో భాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఇక సినిమాలో మిగతా పాత్రలు వారి వారి పాత్రలకు తగ్గట్టు నటించారు.
ప్లస్ పాయింట్స్:

పోలీస్ బ్యాక్ డ్రాప్ లో బలమైన స్టోరీకి స్టోరీని ఎంచుకోవడంలో దర్శకుడు చాల వరకు సక్సెస్ అయ్యారు.
స్టార్ హీరో, హీరోయిన్స్ మరియు ముఖ్య భారీ తారాగణం ఉండటం సినిమాకి కలిసొచ్చింది.
నిర్మాతలు ఎక్కడ రాజి పడకుండా సినిమాను తెరకెక్కించడంతో నిర్మాణ విలువలు పరంగా బాగుంది.
సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్టు బాగానే ఉన్నాయి. అన్ని పాటలు ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్:

సినిమా అన్న తర్వాత కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, అయితే ఈ సినిమాలో కూడా చెప్పుకోదగ్గ కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బలమైన కథని ఉంచుకున్న కృష్ణ వంశీ స్క్రీన్ ప్లే విషయంలో కాస్త వెనుకబడినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్సయినట్టు అనిపిస్తుంది. తన ప్రతి సినిమాలో పాత్రలను అందందంగా తీర్చి దిద్దే ఆయన ఈ సినిమాలో కొన్ని పాత్రలను అర్ధాంతరంగా వదిలిపెట్టడం సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు.

మొత్తంగా చెప్పాలంటే:
మొత్తంగా చెప్పాలంటే కృష్ణ వంశీ సినిమాలను ఇష్టపడే వారికీ ఈ సినిమా భాగానే నచ్చుతుంది. కథకు తగ్గట్టు సినిమాను నిర్మించడంతో ఎక్కడ కూడా గ్రాండియర్ తగ్గలేదు. అయితే కృష్ణ వంశీ గత చిత్రాలను ఉహించుకొని సినిమాకి వెళ్తే మాత్రం కాస్త ఇబ్బంది పడినట్టే అవుతుంది. అయితే సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్, రెజినా, తనీష్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ఉండటం వలన సినిమాకి వెళ్లి చూడొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఖడ్గం’ అంత లేకపోయినా పర్వాలేదు చూడొచ్చు.

టాగ్ లైన్: ‘ఖడ్గం’ అంత లేకపోయినా పర్వాలేదు చూడొచ్చు !!

ఫిల్మిఈవెంట్స్ రేటింగ్: 2.17/5

Categories: రివ్యూ

Tags: ,,,

Leave A Reply

Your email address will not be published.