‘నాని’ సినిమాలో అలనాటి హీరోయిన్.!!

 nanipics

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని నటించిన ‘నిన్ను కోరి’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజే విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చేస్తూనే నాని తన తదుపరి సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు ‘ఎంసిఏ’ అనే టైటిల్ ను ఖరారు చేయగా ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా దర్శకుడు వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో తెలుగులో ఒక వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్ భూమిక ఒక కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ విషయాన్నీ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా కథ కథనాలు అందరి అంచనాలకు మించి ఉంటాయని సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా మలయాళ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.