నితిన్ ‘లై’ సినిమా రివ్యూ: బొంబాట్ బ్లాక్ బస్టర్ !!

LIENewReviewTelugu

నితిన్ ‘లై’ సినిమా రివ్యూ: బొంబాట్ బ్లాక్ బస్టర్ !!

ప్యాషనేట్ ఫిలిం మేకర్స్ గా పేరున్న 14 రీల్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా లై. ఫస్ట్ లుక్ నుండే డిఫ్ఫరెంట్ అప్పీల్ ఉన్న మూవీగా పేరుతెచ్చుకున్న ఈ సినిమాలో నితిన్ నెవెర్ బిఫోర్ అవతార్ లో కనిపించడం, పైగా ఆ న్యూ లుక్ సూపర్ ట్రెండీ గా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ రోజే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ  ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం.

విడుదల తేదీ: 08/11/2017
దర్శకత్వం: హను రాఘవపూడి
సంగీతం: మణి శర్మ
బ్యానర్: 14 రీల్స్ ఎంటెర్టైమెంట్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర
నటీనటులు: నితిన్, మేఘ ఆకాష్, అర్జున్, అజయ్

కథ:

ఇక కథ విషయానికి వస్తే పద్మనాభం అలియాస్ అర్జున్ ఒక తెలివైన రిచ్ బిజినెస్ మాన్, కాగా అతను ఒక వస్తువు గురించి వెతుకుతుంటాడు. ఆ వస్తువు చాల కీలకం కావడంతో దంతో చిక్కుల్లో పడతాడు. ఇక ఏ సత్యం అలియాస్ నితిన్ తన పేరును నిలబెట్టుకుంటూ ఎట్టి పరిస్థిలోను నిజం మాట్లాడని వ్యక్తి ఎప్పుడు అబద్దాలు మాత్రమే చెబుతాడు. ఆలా చైత్ర అలియాస్ మేఘ ఆకాష్ ని చూసి ప్రేమలో పడుతాడు. మొదట్లో ఒప్పుకొని చైత్ర తర్వాత ప్రేమలో పడుతుంది. ఇలా వీరి ప్రేమ హ్యాపీగా సాగుతున్న సమయంలో సత్యం ఒక బాక్స్ పట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఆ బాక్స్ లో ఏముంది?, కథ అమెరికాకు ఎందుకు షిఫ్ట్ అయింది?, చివరికి కథ ఎలా ముగిసిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

ఇక సినిమా నటీనటుల విషయానికి వస్తే నితిన్ ఇందులో చాల కొత్త లుక్ లో కనిపించడం సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అబద్ధాలు చెప్పే సత్యం పాత్రలో నితిన్ పూర్తి స్తాయిలో ఇమిడి పోయాడు అనిపిస్తుంది. నితిన్ తన గత చిత్రాల కంటే నటనలోను, డైలాగ్ డెలివరి లోను ఎంతో వ్యత్యాసం చూపించాడు. ఇక అర్జున్ పాత్ర విషయనికి వస్తే చిత్ర బృందం ముందు నుండి చెప్తూ వస్తున్నట్లే అర్జున్ నటన విలనిజనికే కొత్త అర్ధం చెప్పే లాగా ఉంది. సినిమా చుస్తున్నతసేపు ఈ సినిమాలో ఆయనను తప్ప మరేవారిని ఈ పాత్రలో ఉహించుకోలేరు. ఇక హీరోయిన్ మేఘ ఆకాష్ విషయానికి వస్తే మొదటి సినిమా తోను మంచి అభినయం ఉన్న పాత్ర దొరకడం.  ఆ పాత్రను ఆమె పూర్తి స్తాయిలో ఉపయోగించుకొని తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక సినిమాలో నటించిన అజయ్ మరియు ఇతర నటినటులు వారి వారి పాత్రలకు తగ్గటు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం:

ఇక సినిమా సాంకేతిక వర్గం విషయానికి వస్తే మొదట దర్శకుడు హను రాఘవపూడి గురించే మాట్లాడుకోవాలి. విలనిజం తో సినిమాను మొదలు పెట్టి తధైన రీతిలో స్రీన్ ప్లే ను అందించి సినిమా విజయంలో మేజర్ పాత్ర పోషించారు. ఇకపోతే కథను నమ్మి హను ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. కాగా 14 రీల్స్ సంస్థ నిర్మించే చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథను నమ్మి డైరెక్టర్ కి కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ ఇస్తుంటారు. ఈ సినిమా చూసినప్పుడు కూడా అదే చాల స్పష్టంగా అర్ధముతుంది. 14 రీల్స్ నిర్మించడంతో ఈ సినిమాకి ఎక్కడ లేని గ్రాండియర్ వచ్చింది. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ, కేవలం మెలోడీ పాటలే కాదు మాస్ అదరగొడుతాడని బొంబాట్ సాంగ్ చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలం అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:

స్టోరీ, స్క్రీన్ ప్లే, మరియు డైరెక్షన్

నితిన్ మరియు అర్జున్ పోషించిన పాత్రలు, నటన

బ్యూటిఫుల్ లవ్ సీన్స్

సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

ఆక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్

మైండ్ గేమ్

మైనస్ పాయింట్స్:

సెకండ్  హాఫ్ లో కొంత కామెడీ తక్కువ ఉండటం.

మొత్తంగా చెప్పాలంటే:

భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకే సినిమాలో ఆక్షన్ ఎపిసోడ్స్, బ్యూటిఫుల్ లవ్ సీన్స్, మైండ్ గేమ్, వంటి అన్ని అంశాలని కలగలిపి సినిమా చేయడం అందులోనూ పవర్ ఫుల్ విలన్ పాత్రను సృష్టించడం. విలన్ కి ఏమాత్రం తగ్గకుండా హీరో పాత్రను తీర్చిదిద్దడం సినిమా ప్రేమికులకు మాత్రమే కాకా సామాన్య ప్రేక్షకుడికి కూడా అమితంగా నచ్చుతుంది ఈ సినిమా. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ పూర్తిస్థాయిలో సినిమా గ్రాండియర్ను తీసుకొచ్చిదని చెప్పాలి. మొత్తంగా అన్ని రకాల అంశాలు కలగలిపి ఉన్న ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడొచ్చు.

టాగ్ లైన్: బొంబాట్ బ్లాక్ బస్టర్ !!

ఫిల్మిఈవెంట్స్ రేటింగ్: 3.5/5

 

Categories: రివ్యూ

Tags: ,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.