నితిన్ ‘లై’ సినిమా లేటెస్ట్ అప్డేట్స్.!!

యంగ్ హీరో ‘నితిన్‘ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోస్తున్నారు. కాగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లై‘ ఈ సినిమాను ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు ఆచంట గోపినాథ్, ఆచంట రాము, అనిల్ సుంకర 14రీల్స్ బ్యానేర్ పై నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఒక సరి కొత్త కథాంశంతో రానుందని సమాచారం, ఇప్పటికే నితిన్, అర్జున్ కి సంబంధించిన పోస్టర్లను విడుదల చేయగా ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. మేఘా ఆకాష్ హీరోయినిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆక్షన్ కింగ్ అర్జున్ పాత్ర చాల పవర్ ఫుల్ గా ఉండనుందట. అయితే విడుదలకు ముందే ఎన్నో ప్రాధాన్యతలను సంతరించుకున్న ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్ని రికార్డ్స్ కొడుతుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి ఇప్పటికే భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను రేపు జులై 11న విడుదల చేయనున్నారు. అ.ఆ.. సినిమాతో యాభై కోట్ల క్లబ్ లో చేరిన నితిన్ కొద్దిగా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.