‘నిన్ను కోరి’ సినిమా రివ్యూ.!!

‘నిన్ను కోరి’ సినిమా రివ్యూ:

విడుదల తేదీ: జులై 7, 2017
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాత: డివివి దానయ్య
స్క్రీన్ ప్లే: కోన వెంకట్
సంగీతం: గోపి సుందర్,
నిర్మాణ సంస్థ: డివివి ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: నాని, ఆది పినిశెట్టి, నివేతా థామస్.

నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘నిన్ను కోరి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చారు. కాగా నాని ఈ మధ్య చేసిన సినిమాలు ఎక్కువగా యూత్ ని టార్గెట్ చీసి తీసినవే, ఈ సినిమా కూడా యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా జులై 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం సినిమా ఎలా ఉందొ.

కథ:
ఉమా మహేశ్వర రావ్(నాని) వైజాగ్ లో చదువుకునే యువకుడు, పల్లవి(నివేతా థామస్) ను చూసి ప్రేమలో పడతాడు. పల్లవి కూడా ఉమాను గాడంగా ప్రేమిస్తుంది. ఇలా సాగుతున్న వీరి ప్రేమలో చిన్న ఆటంకం, అదే పల్లవి ఇంట్లో ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం. అప్పుడే పల్లవి నిర్ణయించుకుంటుంది ఉమా తో వెళ్లిపోవాలని. కాగా ఉమా మాత్రం దానికి ఒప్పుకోడు తన లైఫ్ లో గోల్స్ ఉన్నాయంటూ చెప్పి ఢిల్లీ వెళ్ళిపోతాడు. వీళ్ల ప్రేమ విషయం తెలియని పల్లవి తండ్రి అరుణ్ (ఆది పినిశెట్టి) తో ఆమెకు పేళ్ళి నిర్ణయిస్తాడు. కొన్ని కారణాల వలన పల్లవి కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది. కాగా విడిపోయిన ఉమా, పల్లవి ప్రేమ కథ ఎలా ముగిసింది?, చివరికి వీళ్ళు కలిసారా లేదా?, అనేదే అసలు సినిమా కథ.

నటీనటుల పనితీరు:
నాచురల్ స్టార్ నాని ఎప్పటిలాగానే తన నటనతో పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ సన్నివేశాల్లో ఆయన చేసిన కొన్ని ఎమోషన్ సీన్స్ అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి. మొత్తంగా నాని ప్రేమలో విఫలమైన యువకుడిగా సినిమాకి ఎంత చేయాలో అంత చేసాడు. ఇక నివేతా థామస్ విషయానికి వస్తే ఈ సినిమాతో మంచి అభినయం ఉన్న పాత్ర దక్కిందని చెప్పాలి, ఆమె చేసిన గత చిత్రాల కంటే నటనలోనూ, టైమింగ్ లోను మంచి ప్రతిభ కనబరిచిందని చెప్పాలి. ఇక ఆది పినిశెట్టి విషయానికి వస్తే సినిమా సినిమాకి తన ప్రతిభను పెంచుకుంటూ పోతున్నారు. ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది పాత్రకు తగ్గ నటనను ప్రదర్శించి అందని ఆకట్టుకుంటాడు. ఇక సినిమాలోని ఇతర పాత్రలు వారి వారి పాత్రలకు తగ్గట్టు నటించి ఆకట్టుకుంటారు.
సాంకేతిక వర్గం:
సినిమా చూస్తున్నంత సేపు దర్శకుడు శివ నిర్వాణ కథే రాసుకున్నప్పుడే ఒక క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తుంది. అంతలా ఈ సినిమా కథ ఆకట్టుకుంటుంది. దర్శకుడు కల కన్నా ప్రతి సన్నివేశం నిజానికి నాని ప్రాణం పోశారు. గోపి సుందర్ అందించిన సంగీతం బాగుంది. ఆయన అందించిన ప్రతి పాట థియేటర్ లో ప్రేక్షకులని అలరించాయి. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ప్రధానంగా సినిమాటోగ్రఫీ సినిమాకి కసిసొచ్చే అంశం.
ప్లస్ పాయింట్స్:
>> ప్రధానంగా నాని నటన ఆకట్టుకుంటుంది,
>> నివేతా థామస్ అందంతో పాటు, మంచి అభినయాన్ని ప్రదర్శించింది,
>> దర్శకుడు కథ రాసుకున్న విధానం కొత్తగా ఉంది,
>> కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి,
>> సినిమాను బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో దర్శకుడు విజయం సాధించాడు.
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ..కానీ చెప్పిన విధానం బాగుంది.

మొత్తంగా చెప్పాలంటే:
నిన్ను కోరి సినిమా గురించి చెప్పాలంటే ఫామిలీ తో చూడదగ్గ యూత్ ఫుల్ లవ్ స్టోరీ, నిజానికి నాని ఈ మధ్య చేసిన సినిమాలు అన్ని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. అయితే సినిమా కథ కాస్త ఓల్డ్ గా అనిపించినా దర్శకుడు చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. మొత్తంగా చెప్పాలంటే మంచి సినిమా చూడాలనుకునే వారు తప్పకుండ చూడలిసిన చిత్రం.

టాగ్ లైన్: ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ చక్కటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.!!

ఫిల్మిఈవెంట్స్ రేటింగ్: 3.5/5

Categories: రివ్యూ

Tags: ,,,,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.