‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ జెన్యూన్ రివ్యూ !!

nene review_Thumbnail_V1

‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ జెన్యూన్ రివ్యూ:

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ‘రానా’ ఆ చిత్రం తర్వాత చేసే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే కెరీర్ మొదటి నుండి మిగతా హీరోల కంటే కాస్త డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్న రానా బాహుబలి 2 తర్వాత ఒకప్పటి టాప్ డైరెక్టర్ తేజ చెప్పిన ఒక కొత్త కథని ఎంచుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్స్ లో సందడి చేస్తుంది.

కథ:

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక పల్లెటూరిలో వడ్డీ వ్యాపారి అయిన జోగేంద్ర తన భార్య అయిన రాధ తో కలిసి హ్యాపీ గా జీవిస్తుంటాడు.అయితే ఈ లోగా రాధ ప్రెగ్నెంట్ అవుతుంది.కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ లో ఆమె గర్భం పోవడమే కాక ఎప్పటికి తల్లికాలేని సిట్యుయేషన్ ఎదురవుతుంది.అయితే ఆ పరిస్థితుల్లో రాధ కోరిక మేరకు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు.ఇక అక్కడినుండి ఎదురయిన పరిస్థితుల ప్రభావంతో అందరిని తన బ్రెయిన్ గేమ్ తో తొక్కుకుంటూ సి.ఎం చైర్ కి చేరువవుతాడు.కానీ అదేటైం లోప్రత్యర్దుల గేమ్ లో ఇరుక్కుని రాధ ని పోగొట్టుకుని,ఉరికంబం ఎక్కే స్టేజ్ కి వెళతాడు.అయితే ఇంతకీ అసలు రాధ జోగేంద్రను పొలిటీషియన్ గా మారమని ఎందుకు చెప్పింది?,రానా ఎలాంటి బ్రెయిన్ గేమ్ ఆడాడు?,రాధ ఎలా చనిపోయింది?,చివరికి జోగేంద్ర చనిపోయాడా లేదా అనేది మిగతా కథ.

నటీనటుల & సాంకేతిక వర్గం పనితీరు:
ఇక సాంకేతికత విషయానికి వస్తే దర్శకుడు కథ రాసుకున్నపుడే అందులోని పాత్రలను చాల బలంగా రాసుకున్నారు. దర్శకుడు తేజ తన గత చిత్రాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా కథని ఒక కొత్త తరహాలో చూపించడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు. ఇక జోగేంద్ర పాత్రలో రానా తనదైన రీతిలో నటించి మెప్పించాడు. అసలు కథ మొత్తం రాధా చుట్టూనే తిరుగుతుంది. సినిమా చుసిన్నప్పుడు ఆ పాత్రకి కాజల్ తప్ప ఇంకెవరిని ఉహించుకోలేం. అంతలా నటించింది కాజల్, ఇక సినిమా లోని మిగతా పత్రాలు వారి వారి పాత్రలకు తగ్గట్టు నటించి మెప్పించారు.

ప్లస్ పాయింట్స్:
కథనం,
మాటలు,
సంగీతం,
నటీనటులు,
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ,
ఊహించగలిగే కొన్ని ట్విస్టులు,
రొటీన్ టచెస్ ఉన్న ఓవర్ డ్రమాటిక్ సీన్స్ ,
యాంటీ క్లైమాక్స్

విశ్లేషణ:
అలనాటి టాప్ డైరెక్టర్ తేజ చాల రోజులు గ్యాప్ తీసుకొని సినిమా కావడం, టైటిల్ దగ్గరి నుండి సినిమా దాకా పూర్తిగా వైవిద్యం చూపించడంతో అటు సినిమా లవర్స్ ని మాత్రమే కాకా ఇటు సామాన్య ప్రేక్షకుడిని సైతం ఆకట్టుకోగలిగింది ఈ చిత్రం. ఇక రానా విషయానికి వస్తే బాహుబలి 2 సినిమా తర్వాతి సినిమా కావడం తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తో తేజ మళ్ళి హిట్ ట్రాక్ ఎక్కడని అనిపిస్తుంది.

ఫిల్మిఈవెంట్స్ రేటింగ్ : 3/5

Categories: రివ్యూ

Leave A Reply

Your email address will not be published.