పవన్ రికార్డును దాటేసిన నాని !!

ఏకంగా బ్యాక్ టు బ్యాక్ 7 హిట్స్ తో కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్న నాని నిన్నుకోరి సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఈ సినిమా ఓవర్ సీస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకి కాసుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే అప్పుడే అవలీలగా మిలియన్ మార్క్ క్రాస్ చేసి ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. అయితే అక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న నాని ఏకంగా పవన్ కళ్యాణ్ రికార్డ్ ని క్రాస్ చేసి జూనియర్ ఎన్టీఆర్ సరసన నిలిచాడు. అవును, పవన్ కెరీర్ లో అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకున్నాయి.

కానీ నిన్నుకోరి తో నాలుగోసారి కూడా మిలియన్ క్లబ్ లో ఎంటర్ అయ్యాడు. ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి ఇలా నాలుగు సినిమాలతో పవన్ ని దాటాడు. ఇక మజ్ను, జెంటిల్ మెన్ సినిమాలు కూడా మిలియన్ డాలర్స్ మార్క్ కి చేరువగా వచ్చాయి. ప్రస్తుతం నాని నటిస్తే సినిమా హింట్ అంటూ ఇండస్ట్రీ అంతా బీభత్సమయిన టాక్ నడుస్తుంది. ఇక నాని టార్గెట్ మహేష్ ని రీచ్ అవ్వడమే. మొత్తానికి రికార్డ్స్ కోసం నాని వెళ్లకపోయినా అవే నాని ని వెదుక్కుంటూ వచ్చేస్తున్నాయి.

Categories: గాసిప్స్

Tags: ,,,

Leave A Reply

Your email address will not be published.