‘ఫిదా’కి సెన్సార్ బోర్డు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా?

ఈ నెల 21 న రిలీజ్ అవుతున్న సినిమాల్లోకి చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్న సినిమా ‘ఫిదా‘. వరుణ్ తేజ్ హీరో గా, మలయాళీ ప్రేమమ్ లో మలర్ గా మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా ఫిదా.దిల్ రాజు బ్యానర్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చెయ్యడంతో ఈ సినిమా ఒక మోడరన్ లవ్ క్లాసిక్ గా మిగిలిపోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ తెడ్చుకుంది ఫిదా. ఈ సర్టిఫికెట్ తో పాటు సెన్సార్ వాళ్ళు చెప్పిన మాటలు కూడా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని మలర్ తన స్టన్నింగ్ యాక్టింగ్ తో ఫన్నీ గా నడిపించేసిందట.

కానీ సెకండ్ హాఫ్ లో ‘వరుణ్ తేజ్‘ యాక్టింగ్ కి మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారని, ముఖ్యంగా క్లయిమాక్స్ బొమ్మరిల్లు తరహాలో పదేళ్ల తరువాత కూడా మాట్లాడుకునేలా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు సూపర్ టాక్ తెచ్చుకున్నాయి. పైగా ఈ సినిమాలో కామెడీ పండించడంలో శేఖర్ కమ్ముల తన స్టైల్ కూడా కొంచెం మార్చాడట. నిజామాబాద్ టు న్యూయార్క్ అంటూ సాగే ఈ లవ్, హేట్, లవ్ స్టోరీ కి టాప్ టెక్నీషియన్స్ పనిచేసారు.

అసలు ఈ సినిమా స్టోరీ ముందు ‘మహేష్ బాబు‘ కి చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న శేఖర్ కమ్ముల అతనికి ఉన్న ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల రెండు సంవత్సరాలు వెయిట్ చెయ్యాల్సి రావడంతో ఈ సినిమాని ఇలా వరుణ్ తో చేసాడు. సో, ఇంతమందిని స్క్రిప్ట్ దశలోనే ఫిదా చేసిన ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకాన్ని సెన్సార్ రిపోర్ట్ మరింత పెంచింది.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.