అమెరికా రేడియో స్టేషన్ లో ‘బాహుబలి-2’ ముచ్చట్లు…!

బాహుబలి2 ముచ్చట్లు

‘బాహుబలి ది కంక్లూషన్’ సాధించిన విజయం గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రాంతాలతో గాని భాషతో గాని సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో తిరుగులేని ఘన విజయాన్ని సాధించింది ఈ చిత్రం. ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి-2 సినిమా గురించి అమెరికా రేడియో స్టేషన్ లో ముచ్చటించారు.

‘బాహుబలి ది కంక్లూషన్’ సినిమా 1000 కోట్లు వసూల్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా చెపుతూ అమెరికాలో రిలీజ్ ఆయన ఇతర దేశ చిత్రాల్లో బాహుబలి-2 ఎక్కువ వసూళ్లు సాధించిన మూడవ సినిమా అని కొనియాడారు. ఈ సినిమా విజయానికి కారణాలను చెపుతూ ఇందులో గ్రాఫిక్స్ వర్క్ బాగుందని అందువల్లే అమెరికా ప్రేక్షకులకు నచ్చిందన్నారు. ఇంతవరకు ఇండియన్ సినిమా ఇంత గొప్ప గ్రాఫిక్స్ తో రాలేదని, ఈ సినిమా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి గ్రాఫిక్స్ మొదటి కారణం అన్నారు.

అమెరికా వంటి పెద్ద దేశంలో మన తెలుగు సినిమా గురించి రేడియో స్టేషన్ లో మాట్లాడుకోవడం అక్కడున్న మన తెలుగు వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సమాచారం. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్ల మైలురాయిని దాటబోతుంది.

Categories: గాసిప్స్,ఫిలిం న్యూస్

Tags: ,,,,,,

Leave A Reply

Your email address will not be published.