‘మహేష్’ ప్రభంజనంతో అప్పుడే ‘స్పైడర్’ సూపర్ రికార్డ్ !!

20526304_1964095360270934_6340128487532405121_n

సూపర్ స్టార్ మహేష్ బాబు కి యూత్ లో, లేడీస్ లో ఉన్న హ్యుజ్ ఫాన్స్ ఫాలోయింగ్ గురించి సెపరేట్ గా చెప్పక్కర్లేదు. అయితే రోజు రోజుకు ఆ క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. దానికి నిదర్శనంగా నిలిచింది స్పైడర్ టీజర్. మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయినా స్పైడర్ టీజర్ విడుదలయిన మూడుగంటల్లోపే మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి శరవేగంగా దూసుకుపోతుంది. ఈ క్రేజ్ చూసి రెడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. పైగా లైక్స్ కూడా లక్షకు దగ్గరగా రావడం మరో రికార్డ్.

కేవలం 10 శాతం డిజ్ లైక్స్ మాత్రమే తెచ్చుకున్న ఈ టీజర్ తమిళ్ లో కూడా అప్పుడే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసి అక్కడ కూడా మహేష్ మేనియా మొదలయిపోయిందని తెలుపుతుంది. మహేష్ హీరో గా మురుగదాస్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ట్రైలర్ తోనే ఈ రేంజ్ లో ఉంటె రేపు థియేటర్స్ లో ఇంకెలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా తమిళ్ లోకి అఫీషియల్ ఎంట్రీ ఇస్తున్న మహేష్ కి ఈ సినిమా తిరుగులేని స్టార్డం తెస్తుందని ఫాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ టీజర్ తో మహేష్ జోరు, క్రేజ్ చూస్తుంటే స్పైడర్ దెబ్బకి మొత్తం ఇప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న పాత రికార్డ్స్ అన్ని కొత్తగా స్పైడర్ పేరుతో మారిపోతాయనిపిస్తుంది.

Categories: గాసిప్స్

Tags: ,,,,

Leave A Reply

Your email address will not be published.