మహేష్ బాబు స్పైడర్ సినిమా క్లైమాక్స్ కి వచ్చింది…!

మహేష్

మహేష్ బాబు స్పైడర్ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ సన్నివేశాలను చెన్నై లో చిత్రీకరిస్తున్నారట. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ తన తదుపరి సినిమాని తన కెరీర్ లో ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో నటించంచబోతున్నారు. మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే సినిమాను ఈ నెల 22న షూటింగ్ ప్రారంభించనున్నారట.

ఇక ‘స్పైడర్’ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు చెన్నై లో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రెండు పాటల మినహా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. ఈ రెండు పాటలను జూన్ లో చిత్రీకరిస్తారట అంటే వచ్చేనెలతో ఈ సినిమాకి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ సినమా రిలీజ్ డేట్ ను పలు సార్లు వాయిదా పడుతూ వస్తుంది.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.