యాంకర్ గా ‘ఎన్టీఆర్’ సక్సెస్ అయ్యాడా?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన ప్రోగ్రాం ‘బిగ్ బాస్‘ స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాం కి ఎన్టీఆర్ యాంకర్ అనగానే ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. అయితే సినిమాల్లో కొంచెం సీరియస్ గా ఉండే క్యారెక్టర్స్ చేసే ఎన్టీఆర్ ఈ షో ఎలా చేస్తాడా అని అందరికి చిన్న టెన్షన్ ఉంది. ఈ మధ్య చిరు యాంకర్ గా మారి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడంతో ఈ షో గురించి అంతా ఎదురు చూసారు. అయితే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు.

ఎన్టీఆర్ తన బిహేవియర్ కి ఏమీ సంబంధం లేకుండా కేవలం నవ్వుతూ, హుషారుగా ఈ షో ని నడిపించాడు. ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తూ నడిపించిన విధానం ఆకట్టుకుంది. పైగా పార్టిసిపెంట్స్ వచ్చినప్పడు వాళ్లకు సంబంధించిన పాటలు పాడుతూ, జోక్స్ వేస్తూ హుందాగా రిసీవ్ చేసుకున్న తీరు మెప్పించింది. ఇక ఈ షో కి ఎంపిక చేసిన వివిధ రకాల మస్తత్వాలతో ఉన్న పార్టిసిపెంట్స్ కూడా షో ఆసక్తికరంగా మారడానికి ఒక కారణంగా నిలిచారు. ఫస్ట్ ఎపిసోడ్ వరకు తారక్ తన చలాకీతనంతో నడిపించేసాడు. అయితే ఇక ముందు జరిగే ఎపిసోడ్స్ లో స్పాంటేనిటీ తో ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానిపై షో రేంజ్ ఆధారపడివుంది. హిందీలో సల్మాన్ వేసే ఇన్స్టంట్ పంచ్ ల వల్లే ఆ షో అంతగా సక్సెస్ అయింది.

స్పాంటేనిటీ విషయంలో ఎన్టీఆర్ కి తిరుగులేదు. ఇంటర్వ్యూస్ లో అతను వేసే పంచ్ లకు మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుని చూస్తారు. కాకపోతే హౌస్ లో ఎవరయినా తప్పుచేస్తే సల్మాన్ ఏకేస్తాడు. ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్ ఎలా స్కోర్ చేస్తాడు అనేదానిపై ఈ షో సక్సెస్ రేటు ఆధారపడివుంటుంది. మొత్తానికి ఆరంభం అదిరింది…మిగతాది లెట్స్ వెయిట్ అండ్ సి.

Categories: గాసిప్స్

Tags: ,

Leave A Reply

Your email address will not be published.