‘రాజమౌళి’ మాస్టర్ ప్లాన్ అదిరింది !!

‘బాహుబలి’ వీర విహారంతో ఇప్పడు రాజమౌళి మొదలుపెట్టబోయే కొత్త ప్రాజెక్ట్ పై ఎక్కడలేని ఉత్కంఠ నెలకొంది. ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అని, మరో పక్క మహాభారతం అని, ఇంకోపక్క బాలీవుడ్ హీరోతో ఛత్రపతి శివాజీ తీస్తున్నాడని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. నిజానికి వీటన్నిటిని వింటూ ఎంజాయ్ చేస్తున్న జక్కన్న సైలెంట్ తన తరువాతి సినిమా కథని రెడీ చేసుకుంటున్నాడు. బాహుబలితో వచ్చిన క్రేజ్ ని వదులుకోకుండా, అలాగే పూర్తిగా టాలీవుడ్ కి దూరం కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక మల్టీస్టారర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే ఆ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి లైకా ప్రొడక్షన్స్ తో చర్చలు కూడా జరుగుతున్నాయి అనేది ఇన్ సైడర్స్ అందిస్తున్న సమాచారం. ఇక తెలుగులో హీరో గా మహేష్ బాబు ని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మహేష్ కూడా ఎప్పటినుండో సరైన ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. పైగా బాలీవుడ్ కి ఈజీ గా కనెక్ట్ అయ్యే ఫీచర్స్ మహేష్ సొంతం.

పైగా స్పైడర్ తో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుండడంతో ఇది బెస్ట్ ఆప్షన్ గా ఫీల్ అవుతున్నాడట. అయితే ముగ్గురు స్టార్ హీరోలను బాలన్స్ చేసే సూపర్ పాయింట్ దొరికిందని, ఆల్మోస్ట్ కథ వరకు దాదాపుగా పూర్తయిందని ప్రొడక్షన్ హౌస్, హీరో లు ఫైనల్ అయిన తరువాతే గ్రాండ్ అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్. ఇక తెలుగులో రాజమౌళి కమిట్ అయిన ప్రొడ్యూసర్స్ ని కూడా అందులో పార్టనర్స్ గా చేర్చాలని జక్కన్న ఆలోచన. మొత్తానికి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కంటే హిట్ ఇచ్చిన వాళ్లపై ప్రెజర్ ఎక్కువగా ఉంటుందని రాజమౌళిని చూస్తే అర్ధం అవుతుంది.

Categories: గాసిప్స్

Tags: ,,,,,

Leave A Reply

Your email address will not be published.