రాజా ది గ్రేట్: బ్లైండ్ అంటూ ట్రెండ్ సెట్ చేస్తున్న ‘రవితేజ’ !!

ravitejanew

మాస్ మహారాజా రవి తేజ. ఒకప్పుడు రవితేజ సినిమా రిలీజ్ అవుతుందంటేచాలు మాస్ ఆడియన్స్ కి పండుగ అయితే మిగతావాళ్లందరికి మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. గతకొంత కాలంగా ఫామ్ లో లేక ఇబ్బందిపడుతున్న రవితేజ ఈ మధ్య డ్రగ్స్ అంటూ చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కున్నాడు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన రాజా ది గ్రేట్ టీజర్ తో మునుపటి రవితేజ మళ్ళీ మనముందుకు వచ్చేస్తున్నాడని స్ట్రాంగ్ కన్వేయింగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో బ్లైండ్ మాన్ గా కనిపిస్తున్నాడు మన మాస్ మహారాజ్.తన స్టైల్ లో రెట్టించిన ఉత్సాహంతో కామెడీ ని పీక్స్ లో పండించాడు. లాంగ్వేజ్ లో బాడీ లాంగ్వేజ్ లో కూడా మునుపటి జోష్ కనిపిస్తుంది.

పైగా ఈ సినిమాకి అలవోకగా కామెడీ ని పండించే అనిల్ రావిపూడి రైటర్ కమ్ డైరెక్టర్ కావడంతో ఆ చమత్కారం టీజర్ లో కూడా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రాధికా లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా ఎదో ఒక స్ట్రాంగ్ కథను నడిపిస్తున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో అందరిని ఫ్లాట్ చేసిన మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో రాజా అలియాస్ రవితేజ ని పటాయించబోతుంది. మొత్తానికి రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అయ్యేలా టీజర్ తోనే అలరించిన రాజా ది గ్రేట్ టీం కూడా రియల్లీ గ్రేట్ అనిపించుకుంటుంది. ఈ టీజర్ తో ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే 2 అండ్ హాఫ్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ టీజర్. అది మ్యాటర్.

Categories: గాసిప్స్

Tags: ,,,

Leave A Reply

Your email address will not be published.