రిలీజ్ కి ముందే షాక్ ఇస్తున్న ‘లై’

లై‘ కి సంబందించిన ప్రతి విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ అమెరికాలో రెండునెలలకు కు పైగా షూటింగ్ జరుపుకుంది అనే ఒక్క టాక్ తో ఈ సినిమా స్టోరీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా టీజర్ కూడా ఎదో బిల్డప్ షాట్స్ తో నింపెయ్యకుండా సినిమా టైటిల్ కి ఎంత ఇంపార్టెన్సీ ఉందనే విషయం కన్వే అయ్యేలా మీనింగ్ ఫుల్ గా రిలీజ్ చెయ్యడంతో ఆ హైప్ మరింత పెరిగింది. ఏకంగా హీరో, విలన్స్ మధ్య కురుక్షేత్రం రేంజ్ లో మైండ్ బ్లోయింగ్ పవర్ గేమ్ నడుస్తుందని తెలుస్తుంది.

అయితే దానికి కారణం లవ్ మాత్రమేనా?, ఇంకేమైనా ఉందా అనేది కూడా మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. నితిన్ మేకోవర్ చూసి అంతా స్టన్ అయ్యారు. అర్జున్ కూడా మరో హీరోలా ఇంటెన్సిఫైడ్ లుక్స్ తో ఇరగదీస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా నంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అయిన లై టీజర్ ఏకంగా రెండున్నర మిలియన్ వ్యూస్ తో సినిమా సక్సెస్ రేంజ్ ని ముందే ప్రెడిక్ట్ చేస్తే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ కోసం ఏర్పడిన పోటీ ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. నితిన్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రైస్ ఇచ్చి కొనుక్కోవడానికి రెండు ఛానల్స్ పోటీపడుతున్నాయంట. ఆల్రెడీ 7 కోట్లకు అటు ఇటుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

లై టీజర్ కి వచ్చిన జెన్యూన్ రెస్పాన్స్ వల్ల ,సూపర్ రిచ్ అండ్ గ్లాసి అవుట్ ఫుట్ వల్ల ఇది సాధ్యమయింది.ఈ సాటిలైట్ డీల్ వల్ల సినిమాపై పాజిటివిటీ మరింతగా పెరుగుతుంది. ఆగస్టు 11 కి ఎంత కాంపిటేషన్ ఉన్నా కూడా లై సినిమాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ దక్కుతుంది. ఇప్పటికే నితిన్ రేంజ్ ని మార్చేసిన లై , భారీ సినిమాలను అందించిన 14 రీల్స్ బ్యానర్ కి పూర్వ వైభవం తీసుకురావడం ఖాయం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.

Categories: గాసిప్స్

Tags:

Leave A Reply

Your email address will not be published.