రీల్ లైఫ్ లోకూడా ఫెయిల్ అయిన హాట్ పెయిర్ !!

రణ్ బీర్ సింగ్-కత్రినా కైఫ్. గత సంవత్సరం వరకు హాట్ పెయిర్ ఆఫ్ బి-టౌన్ అనిపించుకున్న ఈ జంట లాస్ట్ ఇయర్ హర్టింగ్ గా బ్రేక్ అప్ అయ్యారు. ఇక ఈ బ్రేక్ అప్ తరువాత కత్రినా మళ్ళీ సల్మాన్ కి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే తాజగా ఈ జంట ని మరోసారి వార్తల్లో నిలిపింది జగ్గా జాసూస్ సినిమా. ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా చిత్రాలే చోటుచేసుకున్నాయి. హీరోయిన్ కత్రినా ని పక్కన ఉంచుకుని ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన అనురాగ్ బసు కి రణ్ బీర్ లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం, అలాగే ఈ ఇద్దరిపై ఫోటో షూట్ జరుగుతున్నప్పుడు సల్మాన్ రావడంతో కనీసం చెప్పకుండా కత్రినా సల్మాన్ ని కలిసి గంటలకొద్దీ ముచ్చట్లు పెట్టడం వంటివి ఈ సినిమా ప్రొమోషన్ కి బాగా పనికొచ్చాయి.

ఇలా రకరకాల స్టoట్స్ వేసి రిలీజ్ చేసిన ఈ సినిమా సరియైన కంటెంట్ లేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమయిన రిపోర్ట్ తెచ్చుకుంది. సినిమాలో ఒక్క రణ్ భీర్ యాక్టింగ్ మినహాయిస్తే మిగతా సినిమా అంతా టార్చర్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫాంటసీ అంతా డిస్కవరీ ఛానల్ లో ప్రోగ్రాం లా ఉందని ట్రోలింగ్ పేజెస్ లో ఏకుతున్నారు. థియేటర్స్ రిపోర్ట్ కూడా అంతా గొప్పగా ఏమీ లేదు. ఇద్దరికీ హిట్ కావాల్సిన ఈ టైం లో ఈ సినిమా ఇలాంటి రిసల్ట్ తెచ్చుకోవడం కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే.

అయితే ఇది ముందే ఊహించిన కత్రినా కావాలనే సల్మాన్ కి దగ్గరైందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో,అటు సల్మాన్ కి కూడా హిట్ కావాల్సిన పరిస్థితి రావడంతో టైగర్ జిందా హై సినిమా పై కొంచెం ఫోకస్ పెడుతున్నాడు. మొత్తానికి రియల్ లైఫ్ లో బ్రేక్ అప్ చెప్పి అక్కడ ఫెయిల్ అయిన ఈ యంగ్ కపుల్ ఆన్ స్క్రీన్ పై కూడా మెప్పించలేకపోయారు.

Categories: గాసిప్స్

Tags: ,,

Leave A Reply

Your email address will not be published.