రొమాంటిక్ ‘స్పైడర్’ ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు !!

అనౌన్స్మెంట్ దగ్గరనుండి విపరీతమయిన బజ్ క్రియేట్ చేసుకున్న సినిమా స్పైడర్. ఒక పక్క సూపర్ స్టార్ మహేష్, మరో పక్క డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్, గ్రేట్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం, పైగా మహేష్ బాబుకి ఇది అఫీషియల్ తమిళ్ ఎంట్రీ కూడా కావడంతో ఈ సినిమాపై ఇంత హ్యుజ్ హైప్ క్రియేట్ అయింది. అయితే గ్లిమ్ప్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో వచ్చిన టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమా డిలే అవుతూ రావడం మాత్రం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

అయితే ఇప్పడు వచ్చిన లేటెస్ట్ అప్ డేట్ తో ఈ సినిమా ఒక పాట మినహా మొత్తం పూర్తయింది. రీసెంట్ గా రకుల్, మహేష్ బాబులపై తీసిన రొమాంటిక్ సాంగ్ అవుట్ ఫుట్ కూడా ఒక రేంజ్ లో వచ్చింది. మురుగదాస్ టచ్ తో ఉండే ఈ సినిమాలో ఫస్ట్ టైం పాటలకు, ఫైట్స్ కి కూడా చాలా ఇంపార్టెన్సీ ఇస్తున్నారు.అయితే ప్రస్తుతం భరత్ అను నేను షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అందుకే ఆగస్టు 2 నుండి ఉండే షెడ్యూల్ గ్యాప్ లో యూరోప్ వెళ్లి స్పైడర్ లో బాలన్స్ ఉన్న ఆ ఒక్క సాంగ్ కూడా పూర్తి చేస్తారు.

కాగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైంపడుతుంది. అన్నీ పూర్తిచేసుకుని తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి అంటే సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది స్పైడర్. స్పైడర్ లో చాలా ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ వియత్నాం లో షూట్ చేసిన సీక్వెన్సులు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని, రీసెంట్ గా మార్చి షూట్ చేసిన క్లైమాక్స్ కూడా బాగా వచ్చిందని టాక్ నడుస్తుంది.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.