హిట్స్, లైక్స్ తో దుమ్మురేపుతున్న ‘లై’

లై‘, నిజానికి ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఇండస్ట్రీ లో చాలామంది అవాక్కయ్యారు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు అన్నప్పుడు కూడా సేమ్ రియాక్షన్. ఎక్సటార్డినరీ ఫస్ట్ లుక్ నుండి మాత్రం జనాలకు ఈ సినిమాపై ఉన్న లుక్ మారడం మొదలయింది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో కమర్షియల్ టర్న్ తీసుకున్న హను రాఘవపూడి ఈ సినిమాతో భారీ బడ్జెట్ సినిమాల డైరెక్టర్ గా ప్రొమోషన్ అందుకుంటున్నాడని స్ట్రాంగ్ హింట్ ఇచ్చింది రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్. టీజర్ లో అబద్దం గొప్పతనాన్ని చెప్పి ఈ సినిమాకి లై తప్ప వేరే పేరు ఊహించుకోవడానికి వీలులేదని, టైటిల్ మీదే కథ బేస్ అయి ఉందని తేల్చేసాడు.

ఇక విజువల్స్ గురించి మాటల్లోచెప్పడం కష్టం. ఆ గ్రాండియర్ని, విజువల్ ట్రీట్ ని చూసి ఎంజాయ్ చేయాల్సిందే.అమెరికాలోని మోస్ట్ ప్రెస్టీజియస్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కథ పరంగా కూడా అదే రేంజ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో ఉండబోతుందని టీజర్ చెప్పేసింది. ఇక అర్జున్, నితిన్ లుక్స్ గాని, మేక్ ఓవర్ గాని, బాడీ లాంగ్వేజ్ గాని సింప్లీ సూపర్బ్ అని ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాధకి మెయిన్ పిల్లర్ గా నిలిచిన యువరాజ్ సినిమాటిగ్రఫీ ఈ సినిమాకి హార్ట్ లా మారింది.

కేవలం టీజర్ లోనే ఏరియల్ షాట్స్ తో ఇరగదీసాడు.చాలాకాలం తరువాత ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ 40 సెకండ్స్ నిడివిగల ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆర్.ఆర్.స్పెషలిస్ట్ అన్న మాటను మరో సారి గుర్తు చేసాడు. కథని నమ్మి ఎంతయినా ఖర్చు చేసే 14 రీల్స్ తమ గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా అన్ కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో లావిష్ గా సినిమాని తెరకెక్కించారు. ఇలా అన్ని పాజిటివ్ వైబ్స్ కలయికలో వచ్చిన టీజరే పీక్స్ లో ఉండడంతో ఇక 100 ప్లేన్స్ మధ్య షూట్ చేసిన క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే లై ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో అర్ధం అవుతుంది.

అల్ట్రా స్టయిష్ లుక్ తో ఉన్న నితిన్ ఈ సినిమాతో మరో సారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అంటూనే 80 కోట్లు, 90 కోట్లు అంటూ కలెక్షన్స్ కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ లో ఉన్న అందరూ టీజర్ రాక్స్ అంటూ యునానిమస్ ఒపీనియన్ ని ఓపెన్ గానే చెప్పారు.ఆల్రెడీ 25 థౌసండ్ లైక్స్ తో మిలియన్ వ్యూస్ మార్క్ వైపు దూసుకెళ్తున్న లై టీజర్ తోనే తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు అందరి కాన్సెన్స్ట్రేషన్ సినిమా రిలీజ్ డేట్ అయిన ఆగస్టు 11 పైనే ఉంది.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.