నితిన్ ‘లై’ టీజర్ ఫస్ట్ రివ్యూ.!!

నితిన్ ‘లై’ టీజర్ ఫస్ట్ రివ్యూ:

టాలీవుడ్ యంగ్ హీరో ‘నితిన్’ నటిస్తున్న తాజా చిత్రం ‘లై’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరిని అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయగా ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తుంది. ఇక నితిన్ విషయానికి వస్తే ఆయన సినిమా సినిమాకి చాల కొత్త లుక్ లో కనిపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. చిత్ర బృందం విడుదల చేసిన ఈ టీజర్ లలో కూడా నితిన్ తన గత చిత్రాల కంటే చాల కొత్తగా కనిపిస్తున్నారు.

అశ్వద్ధామ హతః….కుంజరః

ఇక ఇందులోని “కోట్ల మంది సైనికులు సరిపోలేదట..పంచ పాండవులు సాదించలేదట..చివరికి కృష్ణుడు ఒంటరికాదట..అబద్దం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవ్వదట…అశ్వద్ధామ హతః….కుంజరః” అంటూ వచ్చే డైలాగ్స్ చూస్తుంటే ఈ సినిమాలో ఇలాంటి బలమైన మరెన్నో భారీ డైలాగ్స్ ఉన్నాయని అనిపిస్తుంది. నిజానికి నితిన్ నటన చాల నాచురల్ గా ఉంటుంది. ఈ టీజర్ లో కూడా తన నట విశ్వ రూపం చూపించాడు.ఒక పర్ఫెక్ట్ టైమింగ్ మెంటైన్ చేయడం చూస్తుంటే అ.ఆ.. సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా నితిన్ కెరీర్ లో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తుంది. ఇక ఈ టీజర్లో ప్రధానంగా చెప్పాల్సింది మెలోడీ బ్రహ్మ మని శర్మ అందించిన బ్యాక్ గ్రౌడ్ చూస్తుంటే సినిమాని ఒక స్థాయిలో ఊహించుకోవచ్చు.

ఇకపోతే సినిమాను కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, అందాల రాక్షసి వంటి పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దర్శకత్వం ఈ టీజర్ ద్వారా మళ్లీ ఒక మంచి సినిమా చేయడానికి . సరి కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ ప్రతినాయకుడి పాత్ర సినిమాకి మరో ప్రధాన బలం అని చెప్పొచ్చు. 14 రీల్స్ బ్యానేర్ పై ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, ఆచంట గోపినాథ్, ఆచంట రాము నిర్మిస్తున్నారు.

నితిన్ ‘లై’ టీజర్:

 

Categories: రివ్యూ

Tags: ,,,,,,,,,,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.