‘లై’ సినిమాకు బొంబాట్ ఓపెనింగ్స్ !!

nithin

ప్యాషనేట్ ఫిలిం మేకర్స్ గా పేరున్న 14 రీల్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా లై. ఫస్ట్ లుక్ నుండే డిఫ్ఫరెంట్ అప్పీల్ ఉన్న మూవీగా పేరుతెచ్చుకున్న ఈ సినిమాలో నితిన్ నెవెర్ బిఫోర్ అవతార్ లో కనిపించడం, పైగా ఆ న్యూ లుక్ సూపర్ ట్రెండీ గా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రమోషనల్ మెటీరియల్ బయటికి వస్తున్నకొద్దీ ఈ సినిమా షూర్ హిట్ అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఓపెనింగ్స్ పరంగా కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది లై. ఈ భారీ ఓపెనింగ్స్ కి నితిన్ కి ఉన్న క్రేజ్ ఒక కారణం మరో ఇద్దరు స్టార్ హీరోస్ అభిమానులు మరో కారణం. ఆ ఇద్దరు స్టార్ హీరోస్ ఎవరంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. లై సినిమా హీరో నితిన్ పవన్ కి ఆల్మోస్ట్ డివోటీ.

తన ప్రతి సినిమాలో పవన్ ని గుర్తుచేసేలా ఎదో ఒక ఎలిమెంట్ ని వాడుతూ, పవర్ స్టార్ అభిమానులకు ఓన్ అయిపోయాడు. పవన్ ని అభిమానించే ప్రతి ఒక్కరు నితిన్ కి కూడా ఫాన్స్ గా మారారు. సో, అందుకే మొదటి నుండి ఈ సినిమాకు పవన్ అభిమానుల సపోర్ట్ బాగా ఉంది. నితిన్ తరువాతి సినిమాకి పవన్ నిర్మాతగా ఉండడంతో పవన్ ఫాన్స్ అంతా నితిన్ నటిస్తున్న లై కి విపరీతమయిన హైప్ తెస్తున్నారు. ఇక లై సినిమాని నిర్మించిన 14 రీల్స్ సంస్థకు మహేష్ బాబుకు ఉన్న స్పెషల్ బాండింగ్ కూడా అందరికి తెలిసిందే.మహేష్ కెరీర్ లో దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ని అందించి 1 నేనొక్కడినే లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అది అంతగా లాభాలు తేకపోయిన మళ్ళీ ఆగడు లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ ని నిర్మించారు. ఇలా మహేష్ తో వరుసగా సినిమాలు నిర్మించిన 14 రీల్స్ అంటే సూపర్ స్టార్ ఫాన్స్ కి కూడా బాగా ఇష్టం. లై సినిమా సూపర్ హిట్ అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి మహేష్ హీరో గా మరిన్ని బ్లాక్ బస్టర్స్ వస్తాయని ఈ సినిమా సూపర్ అవ్వాలని, అవుతుందని స్పెషల్ గా కాంపైన్స్ నిర్వహిస్తున్నారు.

ఇక ఎటూ సినిమాలో అదిరిపోయే కంటెంట్ ఉండడంతో జనరల్ ఆడియన్స్ కి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మారింది లై. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త నంబర్స్ క్రియేట్ చేస్తుంది లై. ఈ సినిమాలో అర్జున్ విలన్ గా కనిపించడం, అమెరికాలోని కాస్ట్లీ లొకేషన్స్ లో రిచ్ విజువల్స్ ఈ సినిమా విజువల్ ట్రీట్ గా ఉంటుంది కన్వే అవడం వాళ్ళ కూడా సినిమా కలెక్షన్స్ ఈ స్థాయిలో వచ్చాయి. లవ్,ఇంటిలిజెన్స్,ఎనిమిటి అనే మూడు ఎలిమెంట్స్ వల్ల ఈ సినిమా అన్ని క్లాసెస్ ని సమానంగా అలరిస్తుందనే నమ్మకం కలిగింది. సెన్సార్ దగ్గర U/A సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా సెన్సార్ బోర్డ్ నుండి కూడా ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాని రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాఫ్తంగా ఆగస్టు 11 న విడుదలకు రెడీ అవుతున్న లై రిలీజ్ కి ముందే సంచలనాలు క్రియేట్ చేస్తుంది.

Categories: గాసిప్స్

Tags: ,,,,

Leave A Reply

Your email address will not be published.