వర్మ ట్వీట్ కి…కీరవాణి రీ ట్వీట్…ఇక అంతే వివాదం మొదలు…!

కీరవాణి

ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ‘బాహుబలి’ వంటి సినిమాలో నటించడం కాదు కనీసం కనిపించిన ఆనంద పాడుతారు అంత. అలాంటిది ఈ సినిమాకి సంగీతం అందించడం అంత సులువు కాదు. కానీ కీరవాణి గారు మాత్రం అలవోకగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించి ఇంతటి ఘన విజయంలో తన వంతు పాత్ర పోషించారు. సినిమా ప్రరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే కీరవాణి తన ట్విట్టర్ ద్వారా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

ప్రస్తుత దర్శకుల గురించి గతంలో చేసిన ట్వీట్స్ అప్పట్లో వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేసారు. దీని సారాంశం ఏమిటంటే పెద్ద హిందీ సినిమా, పెద్ద తమిళ్ సినిమా, పెద్ద మలయాళం సినిమాల కంటే డబ్బింగ్ సినిమా అయిన బాహుబలి గొప్పది. ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ బాహుబలి అంత గొప్పదైతే మరి బాహుబలి ది కంక్లూషన్ మలయాళ వర్షన్ కు పాట పాడమని హిందీ సింగర్ ను అడిగితె ప్రాంతీయ సినిమాకు పాడనని అవమానించినట్టు చెప్పుకొచ్చారు.

Categories: గాసిప్స్,ఫిలిం న్యూస్

Tags: ,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.