‘శమంతకమణి’ మూవీ రివ్యూ !!

‘శమంతకమణి’ మూవీ కాస్ట్ & క్రూ:

విడుదల తేదీ: జులై 14, 2017
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య,
నిర్మాత: ఆనంద్ ప్రసాద్,
సంగీతం: మణి శర్మ
నటీనటులు: సందీప్ కిషన్, నారా రోహిత్, సుదీర్ బాబు, ఆది, రాజేంద్ర ప్రసాద్, సుమన్

‘శమంతకమణి’ మూవీ రివ్యూ:

టాలీవుడ్ యంగ్ హీరోస్ నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు నలుగురు కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ‘శమంతకమణి’, ఇక మొదటి సినిమాతోనే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా తెలుగులో చాల రోజుల తర్వాత వస్తున్న భారీ మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ మన రివ్యూలో చూద్దాం.

కథ:
సినిమా కథ విషయానికి వస్తే పెద్ద వ్యాపార వేత్త అయినా జగన్నాధం(సుమన్) సంబంధించిన ఒక ఓల్డ్ మోడల్ రోల్స్ రాయిస్ కారును దొంగతనానికి గురవుతుంది. జగన్నాధం కుమారుడు కృష్ణ (సుదీర్ బాబు) ఒక రోడ్డు ప్రమాదంలో తల్లి కోల్పోతాడు. కాగా ఈ దొంగతనాన్ని ఎస్సై రంజిత్ కుమార్ (నారా రోహిత్) చాల సీరియస్ గా తీసుకుంటాడు.

నగరంలో మెకానిక్ గా పని చేస్తున్న ఉరఫ్ మహేష్(రాజేంద్ర ప్రసాద్) ని, కోటిపల్లి అనే ఒక చిన్న పల్లెటూరిలో థియేటర్ నడుపుతున్న శివ (సందీప్ కిషన్) ని, బాగా డబ్బులున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సెటిల్ అవ్వాలని ఆశపడ్డ కార్తీక్ (ఆది) ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు వీరికి ఆ కారుకి ఏంటి సంబంధం?, కారు దొంగిలించింది వీళ్లేనా?, చివరికి కథ ఎలా ముగిసిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
అన్ని సినిమాల్లో ఎదో క్యారెక్టర్ సినిమాని నడిపిస్తుంది. కానీ ఈ సినిమాని పూర్తిగా కథే నడిపించిదని చెప్పాలి. ఇక సినిమాలో నటించిన హీరోల విషయానికి వస్తే ముందుగా మధ్య తరగతి యువకుడి పాత్ర చేసిన ఆది గురించి చెప్పుకుంటారు. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగి పోయారు. ఇక సుదీర్ బాబు చేసిన కృష్ణ పాత్ర కూడా ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకుంటుంది. ఇక సందీప్ కిషన్, నారా రోహిత్ లు చేసిన పాత్రలో నటించలేదు పూర్తిగా జీవించేసారు. మొత్తానికి నలుగురిని పెట్టి సినిమా చేస్తున్నారంటే అందరిలో ఉత్కంఠ ఉండేది ఎలా చేసారో అని. కానీ సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఎవరి పాత్రలకు వారు వందకి వంద శాతం న్యాయం చేసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఏ చేసిన పాత్రలో ఇమిడిపోతుంటుంటారు. ఈ సినిమాలో కూడా ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.
సాంకేతిక వర్గం:
మొదటి సినిమాతోనే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య కథ రాసుకున్న విధానం బాగుంది. సినిమా చివరి వరకు శమంతకమణి గురించి ఎక్కడ రివీల్ చేయకుండా కథని చాల చక్కగా చెప్పాడు. ఇకపోతే సినిమాకి సంగీతాన్ని అందించిన మణి శర్మ పూర్తి స్థాయిలో ప్రతి సన్నివేశానికి న్యాయం చేసారు. కెమెరా పనితనం బాగుంది. మొత్తంగా సినిమాలోని అందరూ వారి వారి వర్క్స్ ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు.
ప్లస్ పాయింట్స్:
కథ చెప్పిన విధానం
నలుగురి హీరోల నటన ఆకట్టుకునేలా ఉంటుంది
కొన్ని కామెడి సన్నివేశాలు
హృదయాన్ని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ – కానీ చెప్పిన విధానం బాగుంది
మొత్తంగా చెప్పాలంటే:
మొత్తంగా చెప్పాలంటే చాల రోజుల తర్వాత వచ్చిన భారీ మల్టీస్టారర్ గా మంచి ప్రయత్నం చేసారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చేయడంలో దర్శకుడు చాల వరకు సక్సెస్ అయ్యారు. ఇక నటీనటులు తమ పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేసారు. సినిమా చూస్తున్నంతనేపు నిర్మాతలు రాజీపడకుండా తీసారని అనిపిస్తుంది. మొత్తంగా చాల రోజుల తర్వాత మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది.
టాగ్ లైన్: శమంతకమణి : ఆధ్యంతం – అద్భుతం – ఆసక్తికరం
ఫిల్మిఈవెంట్స్ రేటింగ్: 3/5

Categories: రివ్యూ

Tags: ,

Leave A Reply

Your email address will not be published.