శ్రీదేవి ‘మామ్’ సినిమా రివ్యూ.!!

శ్రీదేవి ‘మామ్’ సినిమా రివ్యూ:

విడుదల తేదీ: జులై 7, 2017
దర్శకత్వం: రవి ఉద్యావర్
నిర్మాత: బోణి కపూర్
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నిర్మాణ సంస్థ: మ్యాడ్ ఐ ఫిలిమ్స్, థర్డ్ ఐ పిక్చర్స్
నటీనటులు: శ్రీదేవి, సజల్ అలీ, అక్షయ్ కన్నా, నవాజుద్దీన్ సిద్ధికి

అలనాటి హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి నటించిన తాజా చిత్రం ‘మామ్’. చాల రోజు గ్యాప్ తర్వాత ఆమె చేస్తున్న ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను శ్రీదేవి భర్త బోణి కపూర్ నిర్మించగా ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం ఈ సినిమా ఎలా ఉందొ.

కథ:
దేవకీ (శ్రీదేవి) ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంటుంది. ఆమె భర్త ఆనంద్ సబర్వాల్ (అద్నాన్ సిద్దిఖీ) కలిసి మెలిసి ఉంటారు. వీళ్ళకి ఇద్దరు కూతుర్లు కాగా దేవకీ ఆనంద్ సబర్వాల్ కి రెండవ భార్య, అయితే వీరి ఇద్దరి కూతుళ్లలో ఒకరు ఆర్య(సజల్ అలీ) ఫస్ట్ భార్య కుమార్తె,

మొదటి నుండి ఆర్యకి, దేవకీ మధ్య చిన్న చిన్న గొడవలు ఉండటంతో వీరి మాటల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉంటుంది. కాగా ఒక రోజు ఆర్య అత్యాచారానికి గురవుతుంది. దీనికి కారణం అయినా వారిని కోర్టు సరైన సాక్షాలు లేవని వదిలి వేస్తుంది. అత్యాచారం చేసిన వారికీ శిక్ష పడుతుందా?, దేవకీ వారిపై ఎలా కక్ష సాధించింది? అన్నదే అసలు కథ.
నటీనటుల పనితీరు:
అందంతో పాటు నటనలోను శ్రీదేవికి ఇప్పటికి ఎవ్వరు పోటీ ఇవ్వలేరు. ఎందుకంటే ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశానికి ఆమె కనబరిచిన ప్రతిభ అమోగం. ఇక శ్రీదేవికి భర్త పాత్రలో నటించిన అద్నాన్ సిద్దిఖీ కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాలంటే సజల్ అలీ ఆర్య పాత్రలో ఆమె చేసిన నటనకు థియేటర్ లో క్లాప్స్ పడుతున్నాయి. ఇక సినిమాలోని ఇతర తారాగణం అంత తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
ప్లస్ పాయింట్స్:
>> శ్రీదేవి నటన,
>> కొన్ని ఎమోషన్ సన్నివేశాలు బాగున్నాయి,
>> కథ, కథనం సినిమాలో
>> దర్శకత్వం బాగుంది.
మైనస్ పాయింట్స్:
>> కథ పాతదైనా..కొత్తగా చూపించాడు.
మొత్తంగా చెప్పాలంటే:
చాల గ్యాప్ తర్వాత శ్రీదేవి నటించిన చిత్రం కాబట్టి అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఒక మాములు కథకి ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు సినిమా తీసిన విధానం బాగుంది. కథను నమ్మి సినిమాలు చూసే వారికీ ఈ చిత్రం అమితంగా నచ్చుతుంది.
టాగ్ లైన్: అమ్మ ప్రేమకు సాక్షం.
ఫిల్మిఈవెంట్స్ రేటింగ్: 3/5

Categories: రివ్యూ

Tags: ,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.