‘సుకుమార్’ సినిమాలో ఆరుగురు హీరోలు !!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో బజ్ ఉన్న సినిమాల్లో దర్శకుడు కూడా ఒకటి. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింతపెంచింది. వినోదం తో పాటు క్యూట్ రొమాన్స్ కూడా బాగానే దట్టించారు. లైటర్ పంచెస్ తో నవ్విస్తూ,రొమాంటిక్ డైలాగ్స్ తో అలరిస్తూ, చివరికి సినిమా సబ్జెక్ట్ కి సంబంధించిన డైలాగ్స్ తో క్యూరియాసిటీ కలిగించాడు. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్…ఇలా కీలక విభాగాలను డీల్ చేసిన హరి ప్రసాద్ ట్రైలర్ తో కన్వీన్స్ చేసాడు. ఇక లీడ్ పెయిర్ అశోక్ బండ్రెడ్డి, ఈషా రెబ్బ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ అవుట్ అయింది.

సినిమా ఇండస్ట్రీ పై సినిమా అంటే ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. దీంట్లో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. సుకుమార్ క్రియేటివ్ పార్ట్ లో ఇన్వాల్వ్ కాకపోయినా అతని మార్క్ ఐడియాలజీ, అతని ఫ్లేవర్ కనిపిస్తుంది. దర్శకుడికి ఈ సినిమాలో ఇచ్చిన డెఫినిషన్ బాగుంది. సినిమాలో దానికి జస్టిఫికేషన్ ఎలా ఇస్తాడో అనే దాని గురించి ఇండస్ట్రీ కూడా వెయిటింగ్. సెటైరికల్ గా చెబుతాడా లేక ఒరిజినాలిటీ ఏంటనేది పెట్టే సాహసం చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇండస్ట్రీ లో జనరల్ గా జరిగే స్క్రిప్ట్ కాపీ వంటి విషయాలు కూడా తప్పకుండా టచ్ చేస్తాడు అనేది ఎక్కువగా వినిపిస్తున్న టాక్.

అలాగే ఈ సినిమాలో టాలీవుడ్ కి సంబంధించిన ఆరుగురు హీరోలు గెస్ట్ అపియరెన్సు ఇస్తారనేది కూడా సినిమాకి బాగా కలిసివస్తున్న అంశం. మొత్తానికి ఇండస్ట్రీ లో స్టార్స్ అంతా తలోచెయ్యి వేసి ఇచ్చిన సపోర్ట్ ని దర్శకుడు బాగానే ఉపయోగించడమే కాదు సొంతంగా ఇంప్రెస్ చెయ్యగలిగాడు. ఇక కొంచెం గ్యాప్ తీసుకున్న సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అన్నిరకాలుగా పాజిటివ్ అంశాలతో వస్తున్న దర్శకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిసల్ట్ అందుకుంటాడో చూడాలి.

Categories: గాసిప్స్

Tags:

Leave A Reply

Your email address will not be published.