‘స్పైడర్’ మూవీ భూమ్ భూమ్ సాంగ్ రివ్యూ !!

maxresdefault

మహేష్ ఫాన్స్ తో పాటు తెలుగు తమిళ ఇండస్ట్రీ లు ఆతృతగా ఎదురుచూస్తున్న స్పైడర్ లోని ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ రిలీజ్ అయింది. బూమ్ బూమ్ భూకంపాల శబ్దమే అంటూ మొదలయిన ఈ సాంగ్ లో తెలుగు భాషలోని పవర్ ఫుల్ వర్డ్స్ అన్నీ వాడి మహేష్ క్యారెక్టర్ లోని హీరోయిజాన్ని ఎలివేట్ చేసారు. ఇప్పటి వరకు ఈ సినిమాలో మహేష్ స్పై గా కనిపిస్తాడని చాలామంది చెబుతూ వచ్చారు.అయితే ఈ సాంగ్ లో ఉన్న లిరిక్స్ తో మహేష్ స్పై అనిడిసైడ్ చేసేసారు.అయితే అలాంటి ఇలాంటి స్పై కాదు, వచ్చే ప్రమాదాన్ని కూడా ఆపేసే వాడు.గెలుపు కూడా తనవాడు అని చెప్పుకునేంత గొప్పవాడు అంటూ సినిమాలో మహేష్ కారెక్టర్ పై క్లారిటీ ఇచ్చేసాడు డైరెక్టర్.ఇక ఈ స్పై కి వినిపించకుండా చీమలు కూడా చిటికెలు వెయ్యమంట.

ఈ ఒక్క లైన్ తో ఈ సినిమాలో మహేష్ బ్రిలియన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.మైండ్ బ్లోయింగ్ మైండ్ గేమ్ తో మురుగదాస్ డైరెక్షన్, మహేష్ బాబు యాక్షన్ రెండూ పీక్స్ లో ఉండేలా స్పైడర్ ఉండబోతుంది అని చెప్పేసింది ఈ సాంగ్.ఇక హారిస్ జై రాజ్ ఎలాగయినా మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి పూనకం వచ్చినట్టు వాయించేసాడు.చివరికి కోరస్ లో సైతం తన ప్రతాపం చూపించాడు. తెలుగులో గూఢచారి వంటి పదాలు వాడి ఈ సూపర్ స్టార్ సినిమాలో ఆ సూపర్ స్టార్ ని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసారు. మొత్తానికి ఇన్నాళ్లు ఓపికగా ఎదురుచూసిన అభిమానులకు వాళ్ళు ఊహించినదానికంటే ఎక్కువ సాటిస్ఫేక్షన్, కిక్ అందించింది స్పైడర్ యూనిట్. ఈ సాంగ్ విన్న తర్వాత స్పైడర్ గురించి ఇంకా అన్ని రోజులు వెయిట్ చెయ్యాలా అన్న భావన కలగడం సహజం. బూమ్ బూమ్ సాంగుతో నిజంగానే భూకంపాల శబ్దం సృష్టించేసారు స్పైడర్ యూనిట్. ఇట్స్ సెలబ్రెటిన్ టైం ఫర్ మహేష్ ఫాన్స్

Categories: గాసిప్స్,రివ్యూ

Leave A Reply

Your email address will not be published.