‘స్పైడర్’ షూటింగ్ లో ఫన్నీ మూమెంట్ !!

సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ షూటింగ్ సమయంలో చాల సరదాగా ఉంటారని చెప్తుంటారు ఆయనతో నటించిన నటీనటులు. అంతలా మహేష్ తన తోటి నటీనటులతో కలిసిపోతారు. కాగా సూపర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పైడర్’ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ తో నవ్వుతు కనిపించరు. ఈ విషయాన్నీ చిత్ర దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియోను పోస్ట్ చేసారు.

ఇక సినిమా విషయానికి వస్తే షూటింగ్ పూర్తి కావస్తుంది. ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా స్పైడర్ లో ఎక్కువ గ్రాఫిక్ వర్క్ రష్యా, ఇరాన్, యూకే లో జరుగుతుందట. ఇకపోతే ఈ సినిమాను దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. ఈ సినిమాకి ప్రముఖ సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ సంగీతం అందించగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయినిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Categories: గాసిప్స్

Tags: ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.