‘హీరోలు – హీరోయిన్స్’ని పూర్తిగా వాడేస్తున్న సుకుమార్ !!

లెక్చరర్ నుండి డైరెక్టర్ గా మారిన ఈ మాస్టారు ఏం చేసినా ఒక లెక్క ఉంటుంది.తాను డైరెక్ట్ చేసే సినిమాల్లో ఎక్కడా గ్రాండియర్ తగ్గడానికి ఒప్పుకొని సుకుమార్ ప్రొడ్యూసర్ గా మాత్రం చిన్న బడ్జెట్ లో పెద్ద హిట్స్ కొట్టేలా ప్లాన్ చేసుకుంటాడు.అయితే ఆయా సినిమాల ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ బడా హీరోస్ ని,తాను చేసే సినిమాల్లోని హీరోయిన్స్ క్రేజ్ ని ఫ్రీ గా వాడుకుంటున్నాడు.కుమారి 21 F టీజర్ ని ఎన్టీఆర్ చేత లాంచ్ చేయించాడు.ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఇప్పడు సెంటిమెంట్ గా దర్శకుడు సినిమా టీజర్ కూడా ఎన్టీఆర్ తోనే లాంచ్ చేయించాడు.ఇక రకుల్ తో ఒక సాంగ్ ని,సమంత తో ఒక సాంగ్ ని విదులచేయించి దర్శకుడు మూవీ మంచి మైలేజ్ వచ్చే మాస్టర్ ప్లాన్ వేసాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవడంతో బిజినెస్ రేంజ్ పెంచేందుకు ఈ సినిమా కి గ్రాండ్ ఆడియో ఫంక్షన్ ఒకటి ప్లాన్ చేసారు.రేపు జరగబోతున్న ఈ ఆడియో ఫంక్షన్ కు చరణ్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసాడు.ప్రస్తుతానికి ఈ దర్శకుడితో సినిమా చేస్తున్నందుకు ఆ దర్శకుడికి హెల్ప్ చెయ్యడానికి ముందుకి వచ్చాడు చరణ్.సో,చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ బొమ్మ పడగానే అందరి కళ్ళు ఒకసారి అటు ఫోకస్ అయ్యాయి.దాంతో సుకుమార్ అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అయింది.మొత్తానికి తన సొంత పనికోసం తనతో సినిమా చేస్తున్న హీరో హీరోయిన్స్ ని ఫ్రీ గా వాడేసుకుంటున్నాడు సుకుమార్.ఆగస్టు 4 న విడుదలకాబోతున్న దర్శకుడు ఏ మేరకు ఆకట్టుకుంటాడో,సుకుమార్ కష్టపడి తెచ్చిన ఈ క్రేజ్ ని ఎంత వరకు కలెక్షన్స్ గా మార్చుకుంటాడో చూడాలి.

Categories: గాసిప్స్

Leave A Reply

Your email address will not be published.