మహేష్ బాబు ‘స్పైడర్’ మూవీ ట్రైలర్ రివ్యూ

spyder-trailer

మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఇటు తెలుగు అటు తమిళ్ చిత్ర పరిశ్రమ వర్గాలు ఎంతగానో ఎదురుచూస్తున్న తాజా చిత్రం స్పైడర్. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఏ ఆర్ మురుగదాస్ తొలి సారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో మొదటి నుండి సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి…అయితే ఫస్ట్ లుక్ నుండి మొదలు ఇప్పుడు వచ్చిన ట్రైలర్ వరకు మహేష్ ఫ్యాన్స్ తో పాటు చిత్ర వర్గాల అందరి నుండి అమితంగా ఆదరణ లభించింది.

ఇకపోతే మొదటగా విడుదల చేసిన టీజర్ తో సినిమా ఏ రేంజులో ఉండబోతుందో చెప్పిన చిత్ర బృందం..తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే ఆ అంచనాలను మరింతగా పెంచేశారు….ఇక ట్రైలర్ విషయానికి వస్తే బలమైన సోషల్ మెసేజ్ ఇస్తూ..అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చే విధంగా తీసిననంటూ అనిపిస్తుంది..కాగా ట్రైలర్ లో మహేష్ నటన, ప్రతి సన్నివేశంలో మహేష్ డైలాగ్ చెప్తున్నా తీరు చూస్తే కచ్చితంగా ఈ చిత్రంలో వన్ మాన్ షో చేసాడని అనిపిస్తుంది.

ఇక దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ విషయానికి వస్తే ఒక కథకి బలమైన సోషల్ మెసేజ్ జోడించి సినిమాలు చేస్తారు..ఆలా చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి…ఈ సినిమాలో కూడా అలంటి అంశాలని పుష్కలంగా తీసుకొని తెరకెక్కించి నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మొత్తానికి సినిమా పై వస్తున్న పాజిటివ్ బజ్ ను చూసి ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు..ఇకపోతే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని దసరా కానుకగా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Categories: గాసిప్స్

Tags: ,,,

Leave A Reply

Your email address will not be published.