‘మేడ మీద అబ్బాయి’ మూవీ జెన్యూన్ రివ్యూ

meda-review1 (1)

మేడ మీద అబ్బాయ్. అల్లరితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్ కొన్నాళ్లుగా చేసిన క్యారెక్టర్స్ చేయడంతో మొనాటనీ వచ్చేసింది. తనకు తనే బోర్ కొట్టేసాడు. అందుకే కామెడీ నో కాస్త పక్కనపెట్టి కాదని నమ్ముకుని మేడ మీద అబ్బాయ్ అనే సినిమాని రీమేక్ చేసాడు. టీజర్ ,ట్రైలర్ తో ఫ్రెష్ నెస్ ఉందనిపించుకున్న ఈ సినిమా ఎలా ఉందొ, అల్లరి నరేష్ ఆశగా ఎదురుచూస్తున్న హిట్ అందించిందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఆత్రేయపురం లో ఇష్టంలేకుండా బి.టెక్ చదువుతూ, ఇష్టమయిన సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకునే శీను అనే ఒక కుర్రాడు ఉంటాడు. అయితే అతను తన ఎదురింటిలోకి కొత్తగా వచ్చిన సింధు ని చూసి ఇష్టపడి తన ఫ్రెండ్స్ దగ్గర గొప్ప కోసం అమ్మయి తనను లవ్ చేస్తుందని చెబుతాడు. అయితే బి.టెక్ ఫైనల్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళ నాన్నకు భయపడి సినిమాల్లో ఛాన్స్ కోసం హైదరాబాద్ పారిపోతుంటాడు. అదే ట్రైన్ లో అనుకోకుండా సింధు కనిపిస్తుంది. దాంతో ఎక్సైట్ అయిన శీను సింధు తో ఒక సెలీఫీ తీసుకుని ఫ్రెండ్ కి పంపుతాడు. ఆ సెల్ఫీ వల్ల అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, చివరికి శీను సింధు ఒక్కటయ్యారా లేదా  వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

ఇంతకుముందు అల్లరి నరేష్ సినిమాల్లో కథ పెద్దగా లేకపోయినా హైలైట్స్ అనదగ్గ హిలేరియస్ పాయింట్స్ లిస్ట్ పెద్దగా ఉండేది.కానీ ఈ సినిమాలో కథ ఎక్కువయింది. హైలైట్స్ లిస్ట్ తగ్గడం కాదు వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.నిజానికి ఈ సినిమా కథని నమ్మి తన ట్రేడ్ మార్క్ అయిన కామెడీ ని చాలా వరకు తగ్గించుకుని ఒక డిఫరెంట్ ప్రయత్నం చేసిన అల్లరి నరేష్ ని అభినందించాలి. అయితే చేంజ్ ఓవర్ పేరుతో తనకు సూట్ అవ్వని కథను ఎంచుకున్నాడు నరేష్. ఈ టైం లో నరేష్ కి కావాల్సింది కధలో కామెడీ ఉన్న కంటెంట్. కానీ ఈ థ్రిల్లర్ కధలో కామెడీ అనుకున్నంత రేంజ్ లో కలవలేదు.ఒరువడక్కన్ సినిమా ని తీసిన ప్రజీత్ దీనిని కూడా  దానిలాగే కష్టపడి ఇంకాస్త డవలప్ చేసి తీసాడు. కానీ నేటివిటీ విషయంలో మాత్రం ఒరిజినల్ వెర్షన్ ని ఫాలో అయ్యాడు. దాంతో సినిమా కొంచెం ఇబ్బందికరంగా తయారయింది.తెలుగు సినిమా చుసిన ఫీలింగ్ కాకుండా ఒక డబ్బింగ్ బొమ్మ చూస్తున్న ఫీలింగ్ కలిగింది.ఈ సినిమా కోసం నరేష్ పడిన కష్టాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని ఒరిజినల్ బాడీ లాంవేజ్ ని వదిలి సినిమా కోసం కొత్తరకంగా బిహేవ్ చేసాడు.అది ఆడ్ గా ఉండకూడదని చాలా హోమ్ వర్క్ చేసాడు. కానీ అది అనుకున్నంత అనుకూల ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇక ఈ సినిమా ద్వారా ఫుల్ లెంగ్త్ ఆర్టిస్ట్ గా మారిన హైపర్ ఆది జబర్దస్త్ తరహా హావభావాలు పలికించడం కూంచెం నిరాశ పరిచింది.అదే టైపు పంచెస్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంతో అదోరకంగా అనిపిస్తుంది. అతను రాసిన డైలాగ్స్ సినిమాలో ఫ్లో లో కాకుండా సెపరేట్ గా కనిపిస్తుంటాయి. ఆడియన్స్ కూడా వాటికే నవ్వగలుతున్నారు. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ బాగానే పండింది.హీరోయిన్ గా కనిపించిన నిఖిలా విమల్ చూడ్డానికి ప్లెజెంట్ గా ఉన్నాకూడా సినిమా అంతా డల్ మూడ్ లో కనిపించడంతో తెలిసిన అమ్మాయి అయితే ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేదేమో అనిపిస్తుంది. ఆర్.ఆర్.కూడా ఒరిజినల్ మూడ్ లో ఉండడంతో చాలా చోట్ల అబ్ డ్రఫ్ట్ గా అనిపించింది. ఓవర్ ఆల్ గా సినిమా లో సోల్ మిస్ అయ్యింది.ఒరిజినల్ లో ఉన్నది రాక, తియ్యాలనుకున్నది చెయ్యలేక మేడ మీద అబ్బాయి ని అయోమయంలో పడేసారు. మొత్తానికి ఒక మంచి టైటిల్ వేస్ట్ అయిపోయింది.సినిమా హిట్టా, ఫట్టా అన్నది పక్కనబెడితే నరేష్ తన మూస లోంచి బయట పడాలని చేసిన ప్రయత్నం కొంతవరకు ఫలిచింది.ఈ వీకెండ్ లో మేడ మీద అబ్బాయి మీ మూవీ ఛాయస్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ సేవ్ సినిమా.

Categories: రివ్యూ

Tags: ,

Leave A Reply

Your email address will not be published.