‘జై లవ కుశ’ జెన్యూన్ రివ్యూ & రేటింగ్!

lava kusa tel review ratin1

‘జై లవ కుశ’ మూవీ జెన్యూన్ రివ్యూ:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘జై లవ కుశ’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఎన్టీఆర్ సినిమాలో మూడు విభిన్న పాత్రలు చేస్తుండడంతో మొదటి రోజు నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం సినిమా ఎలా ఉందొ?

విడుదల తేదీ: 21/సెప్టెంబర్/ 2017
దర్శకత్వం: కే ఎస్ రవీంద్ర(బాబీ)
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్, బ్రహ్మాజీ

కథ:
ఇక కథ విషయానికి వస్తే అన్నదమ్ములైన ముగ్గురు జై, లవ, కుశ లు రామ లక్ష్మణ భరతులాగా పెరగాలని కోరుకుంటారు. కానీ చిన్న తనంలోనే తల్లి తండ్రులను కోల్పోయిన వీరిలో ‘జై’కు నత్తి ఉంటుంది. అల ఉండటం తో అందరూ అవహేళన చేస్తారు. అల అవమానాలు ఎదుర్కుంటున్న ‘జై’ తెనాలి లో నాటకాలు చేస్తున్నప్పుడు పెద్ద బాంబు బ్లాస్ట్ జరిగి ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు. అల విడిపోయిన వారిలో ‘జై’ చాల క్రూరుడిగా తయారవుతాడు. కట్ చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత ‘లవ’ బ్యాంకు మేనేజర్ గా సెటిల్ అవుతాడు. ఇకపోతే ‘కుశ’ చాల కన్నింగ్ ల తయారై దొంగతనాలు చేస్తుంటాడు. అయితే విల్లు ఎలా కలుస్తారు? చివరికి కథ ఎలా మలుపు తిరిగింది? ఈ ముగ్గురి అన్నదమ్ముల కథ ఎలా ముగిసింది? అన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమాలో అన్నింటికన్నా ముందు మాట్లాడుకోవాల్సింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి. అవును కెరీర్ మొదటి నుండి ఎన్నో కష్టతరమైన పాత్రలను అవలీలగా చేస్తూ వస్తున్న ఆయన ఈ సినిమాలో మూడు పాత్రల్లో ఎలా నటించాడో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. అయితే చిత్ర బృందం మొదటి నుండి చెప్పుతున్నట్టుగా సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆయన చేసిన జై, లవ, కుశ పాత్రల్లో ‘జై’ పాత్ర సినిమా చుసిన తర్వాత కూడా మనల్ని వెంటాడటం ఖాయం అంతలా నటించాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. కేవలం అభిమానులకే కాక ఎన్టీఆర్ నటన అందరికి అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చుతుంది.

ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే సినిమాని అనుకున్నదానికంటే ఎక్కువే తీసాడని సినిమా చూస్తే అర్ధమవుతుంది. దర్శకత్వ ప్రతిభలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాల కంటే ఈ సినిమాలో చాల ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా ‘జై’ ఇంట్రడక్షన్ వంటి సినిమాకే హైలెట్ అయ్యే చాల సన్నివేశాలని చాల అవలీలగా తీసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ నటించినా రాశి ఖన్నా, నివేత థామస్ తమ అందం, అభినయం తో చాల నాచురల్ గా నటించారు. బ్రహ్మాజీ మరియు ఇతర పాత్రలు చేసిన వారు వారి పాత్రలు న్యాయం చేస్తూ బాగానే నటించారు.

ఇలాంటి ఎన్నో చెప్పుకోతగ్గ సన్నివేశాలు, పాత్రలున్న ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్న అవి ఎన్టీఆర్ నట విశ్వరూపం ముందు ఆనవు. అయితే ముఖ్యంగా సినిమా కథనం గురించి మాట్లాడుకోవాలి బాబీ మూడు పాత్రలను తన దర్శకత్వ ప్రతిభతో మలిచినప్పటికీ కథనం విషయంలో కాస్త తడబడ్డాడని చెప్పుకోవాలి. ఇకపోతే సాధారణ ప్రేక్షకులకు మాత్రం సాధారణ హిట్ సినిమాల అనిపించినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు మాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా కిక్కివ్వడం ఖాయం. ఈ వీకెండ్ మీ ఛాయిస్ ‘జై లవ కుశ’ సినిమా అయితే తప్పక థియేటర్స్ లో మాత్రమే చుడండి.

టాగ్ లైన్: ‘ఎన్టీఆర్‘ నట విశ్వరూపానికి నిలువెత్తు నిదర్శనం ఈ “జై లవ కుశ

ఫిల్మిఈవెంట్స్ రేటింగ్: 3/5

Categories: రివ్యూ

Tags: ,,,,,,,

Leave A Reply

Your email address will not be published.