‘పైసా వసూల్’ మూవీ జెన్యూన్ రివ్యూ & రేటింగ్ !!

paisa 2

‘పైసా వసూల్’ రివ్యూ:

విడుదల తేదీ: 01/సెప్టెంబర్ /2017
దర్శకత్వం: పూరి జగన్నాధ్
బ్యానర్: భవ్య క్రియేషన్స్
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రియ శరన్, ముస్కాన్ సేథీ, ఖైరా దత్, అలీ, తదితరులు.

పైసా వసూల్‘. వంద సినిమాలు కంప్లీట్ చేసిన బాలయ్య, బుల్లెట్ వేగంతో సినిమాలు చేసే పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో సినిమా అనగానే ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అనౌన్స్మెంట్ స్టేజ్ నుండే ఈ సినిమా పై భయంకరమయిన అంచనాలు ఏర్పడ్డాయి. స్టంపర్ తో సూపర్, ట్రైలర్ తో వావ్ అనిపించిన ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పడు చూద్దాం.

కథ:

ఈ సినిమా కథ పరంగా చూసుకుంటే జస్ట్ ఓ.కె అనిపిస్తుంది. క్రైమ్స్, స్టాబింగ్స్ చేసే తేడా సింగ్ వరల్డ్ నోటోరియస్ క్రిమినల్ అయిన బాబ్ మార్లీ గ్యాంగ్ తో గొడవపడి పోలీసులకు దొరుకుతాడు. అయితే అతని ట్రాక్ రికార్డ్ చాలా వయొలెంట్ గా ఉండడంతో అతనితో బాబ్ మార్లీ గ్యాంగ్ ని పట్టుకోవడానికి పోలీసులు స్కెచ్ వేస్తారు. ఆ విషయాన్ని కూడా పోలీసులకు చెప్పి ఆ గ్యాంగ్ తో ఫ్రెండ్ షిప్ చేస్తాడు తేడా సింగ్. అయితే ఒక మినిస్టర్ ఆర్డర్స్ తో తేడా సింగ్ లవర్ అయిన హారిక ను అటాక్ చేస్త్తారు బాబ్ మార్లీ గ్యాంగ్.దాంతో వాళ్ళను కొట్టి, హారికను రక్షిస్తాడు తేడా సింగ్. కానీ తనని రౌడీ ల బారినుండి కాపాడిన హారిక తేడా సింగ్ ని కాల్చి చంపబోతుంది. తనని కాపాడిన తేడా సింగ్ ని హారిక ఎందుకు కాల్చింది?, అతనికి హారిక కుటుంబానికి సంబంధం ఏమిటి? అసలు ఈ తేడా సింగ్ ఎవరు? ఎక్కడినుండి వచ్చాడు? వంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

ముఖ్యంగా ఈ సినిమాలో అభినదించాల్సింది హీరో బాలయ్యని, డైరెక్టర్ పూరి ని.పూరి ఒక ఫ్యాన్ లా ఫీల్ అయ్యి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రాసుకుంటే, బాలయ్య దాన్ని పూరి ఊహలకు ఏ మాత్రం తగ్గకుండా పెర్ఫార్మ్ చేసాడు. వంద సినిమాలు చేసిన బాలయ్య ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు.పూర్తిగా రగ్గడ్ లుక్ లో మాసీ గా ఉంటూ, ట్రెండీ డైలాగ్స్ చెబుతూ అలరించాడు. ఇక ఫేమ్ లో లేక ఇబ్బందిపడుతున్న పూరి మరోసారి టిపికల్ హీరో కారెక్టరైజేషన్స్ తనకంటే ఎవరు బాగా రాయలేరు అని ప్రూవ్ చేసాడు. అయితే కొన్ని చోట్ల బాలయ్య ఏజ్ కూడా పట్టించుకోకుండా రాసిన, చేసిన కొన్ని సీన్స్ మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఈ సినిమాతో పూరి చాలా వరకు బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ అయిన కైరా దత్, ముస్కాన్ సేథీ కేవలం పాటలకే పరిమితం అయ్యారు. ఇక మెయిన్ హీరోయిన్ అయిన శ్రీయ కి కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉన్న రోల్ దక్కలేదు.సినిమా మొత్తం బాలయ్య ని బేస్ చేసిరాసుకున్నాడు పూరి. కబీర్ బేడీ కి కూడా మామూలు క్యారెక్టర్ ఇచ్చారు. మిగతా నటీనటులంతా పాత్రల పరిధిమేర నటించారు. అయితే టెక్నీషియన్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ గా మారారు.

ఇప్పటివరకు మెలోడియస్ మ్యూజిక్ మాత్రమే కంపోజ్ చేస్తాడని పేరున్న అనూప్ ఈ సినిమాలో అదిరిపోయే సౌండింగ్ ఆర్.ఆర్ కూడా ఇచ్చాడు. అలాగే కెమెరామెన్ ముఖేష్ పనితనం సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా పోర్చుగల్ ఎపిసోడ్ లో,క్లయిమాక్స్ లో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇంత పెద్ద సినిమా ఎగ్జిక్యూషన్ ని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసిన ఛార్మి ని అభినదించాలి. ఆమె హీరోయిన్ కంటే నిర్మాతగా బాగా రాణిస్తుంది. ఎడిటింగ్ పూరి స్టైల్ లో క్రిస్ప్ గా,ఫాస్ట్ గా ఉంది. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలకు తిరుగులేదు. చాలా లావిష్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్య మేక్ ఓవర్ ఫాన్స్ పండగ చేసుకునేలా ఉంది. ప్రతి అయిదునిమిషాలకు రెండు మూడు పూరి మార్క్ డైలాగ్స్ ఎంటర్టైన్ చేస్త్తాయి. ఇక తేడా సింగ్ పాత్రను బాలయ్య లాంటి సీనియర్ హీరో కి రాయటం పూరి చేసిన సాహసం. కానీ ఆ పాత్రలో జీవించి చాలా వరకు దానికి న్యాయం చెయ్యడం బాలయ్య డెడికేషన్.

అయితే ఈ సినిమాలో లోపాలు లేకపోలేదు. కొన్ని సీన్స్ మరీ అతిగా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ ట్విస్ట్ అచ్చం పోకిరి ని పోలి ఉంటుంది. అలాగే పూరి సినిమాల్లో లాజిక్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈ సినిమాలో లాజిక్స్ పూర్తిగా మిస్ చేసారు. బాలయ్య పాత్ర మినహాయిస్తే పెద్దగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు. బాలయ్య చాలా సినిమాల్లో ఒక రేంజ్ లో యాక్షన్ సీన్స్ చేసాడు. కానీ దీంట్లో మాత్రం కొత్తగా కనిపిస్తాడు. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఫాన్స్ కి పండగ చేసుకునేలా ఈ సినిమాని తీర్చి దిద్దిన పూరి పూర్తిగా కాకపోయినా చాలా వరకు మెప్పించగలిగాడు. అయితే కంప్లీట్ గా మాస్ ఎలిమెంట్స్ హైలైట్స్ గా తెరకెక్కిన ఈ సినిమా మిగతా వాళ్ళను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటివరకు బాలయ్యతో పనిచేసిన డైరెక్టర్స్ ఎవ్వరు కూడా చెయ్యని ఒక ప్రయోగం చేసాడు. సినిమాలో అడుగడుగునా ఎన్టీఆర్ డైలాగ్స్ బాలయ్యతో చెప్పిస్తూ, ఆయన పాటలు పాడిస్తూ తేడా సింగ్ క్యారెక్టర్ ని కామన్ ఆడియన్స్ కి రీచ్ చెయ్యడానికి ట్రై చేసాడు. ఈ వీక్ ఎండ్ లో పైసా వసూల్ మీ మూవీ ఛాయస్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసి, సేవ్ సినిమా.

ప్లస్ పాయింట్స్:
బాలయ్య యాక్టింగ్
తేడా సింగ్ క్యారెక్టరైజేషన్
పూరి రాసిన పంచ్ డైలాగ్స్
మ్యూజిక్
కెమెరా వర్క్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
బిగి లేని స్క్రీన్ ప్లే
కిక్ ఇవ్వని ట్విస్ట్
ఇంపాక్ట్ లేని ఫ్లాష్ బ్యాక్
ఎక్కువయిన యాక్షన్ సీక్వెన్సెస్

ఫిల్మిఈవెంట్స్ రేటింగ్: 3/5

Categories: రివ్యూ

Tags: ,,,,,

Leave A Reply

Your email address will not be published.