‘పవన్ – త్రివిక్రమ్’ సినిమా ఫస్ట్ సాంగ్ రాక్స్!!

PSPK1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఒక భారీ హిట్, మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో హాట్ ట్రిక్ సినిమా తెరకెక్కుతుంది. పైగా ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25 వ సినిమా. సో,ఈ స్పెషల్ అండ్ మైల్ స్టోన్ మూవీ గురించి మామూలు వెయిటింగ్ లో లేరు ఫాన్స్. ఒక ఫ్యాన్ గా త్రివిక్రమ్ కి కూడా ఆ వెయిటింగ్ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం, గ్రాఫిక్ వర్క్ కి కూడా టైం తక్కువగా ఉండడంతో దాని వాయిదా వేశారు. కాకపోతే పవన్ అభిమానులని ఖుషి చెయ్యడానికి ఆ సినిమా నుండి ఒక లవ్లీ సాంగ్ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసారు. తమిళ్ లో యువ సంచలనంగా నిలిచిన అనిరుధ్ సాంగ్ కంపోజ్ చేసి వినిపిస్తుంటే త్రివిక్రమ్ దాన్ని వింటూ ఎంజాయ్ చేసిన వీడియో ని రిలీజ్ చేసారు.

బయటికొచ్చి చూస్తే టైం ఏమో త్రి ఓ క్లాక్ అనే సాంగ్ ని శాంపిల్ గా వినిపించారు. ఇక ఆ వీడియో చివర్లో ఉన్న ఒక్క షాట్ మాత్రం పవన్ అభిమానులని ఉర్రుతలూగిస్తుంది. నీట్ గా టాక్ చేసుకుని పవన్ నుంచుంటే పవన్ పక్కన ఒక కుర్చీ తిరుగుతుంటుంది. ఆ ఒక్క షాట్ చాలు సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఆ షాట్ లో ఇంటెన్సిటీ ,పవర్ స్టార్ స్టైల్ సూపర్ అంతే. ఈ టీజర్ లో ఇంకో విషయం కూడా పవన్ ఫాన్స్ హ్యాపినెస్ ని డబుల్ చేసింది. అదేంటంటే ఈ సినిమాని 2018, జనవరి 10 న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. సో, టీజర్ చూసి మురిసిపోదాం అనుకున్న కోరిక తీరకపోయినా కూడా ఇలా ఒక వీడియో తో డబుల్ ధమాకా అందించాడు త్రివిక్రమ్.

Categories: గాసిప్స్

Tags: ,,,,

Leave A Reply

Your email address will not be published.