‘స్పైడర్’ సెకండ్ సాంగ్ హాలీ హాలీ అదుర్స్ !!

Mahesh1

‘స్పైడర్’ లో ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోవడంతో ఫాన్స్ అంతా అదే పాటను రిపీట్ మోడ్ లో వింటున్నారు. మామూలుగా ఆడియన్స్ కి మాత్రం అది ఒక మోస్తరుగా నచ్చింది అంటున్నారు. అయితే ఈ సారి మాత్రం అందరిని మెప్పించి సినిమాకి ఫుల్ క్రేజ్ తెచ్చే డ్యూయెట్ ని రిలీజ్ చేస్తున్నారు. హాలీ..హాలీ అంటూ సాగె సింగిల్ ని రిలీజ్ కి రెడీ చేసారు. ఈ సాంగ్ ని సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తునట్టు అఫిషియల్ గా ప్రకటించారు. అయితే గతంలో టైం పరంగా కొంచెం ఇబ్బంది కలగడంతో ఈ సారి మాత్రం టైం ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. స్పైడర్ రీలీజ్ డేట్ దగ్గరికి వచ్చేస్తున్నా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు అని కలవరపడుతున్న మహేష్ అభిమానులకు ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్.

ఈ సాంగ్ కి సంబంధించి రిలీజ్ చేసిన స్టిల్ లో మహేష్ కాస్ట్యూమ్స్,స్టైలింగ్ కూడా సూపర్ గా ఉన్నాయి. మహేష్ పక్కన రకుల్ కూడా డిఫరెంట్ లుక్ లో బావుంది. స్పైడర్ టీజర్ అభిమానులను పూర్తిగా సాటిస్ఫై చెయ్యలేదని కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇక స్పైడర్ కి సంబంధించిన ప్రతి విషయం సినిమాపై హైప్ పెంచేలా ఉండాలని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయట, అందుకే సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడానికి కాస్త లేట్ అయింది. ఇక ఇప్పడు స్పైడర్ షూటింగ్ మొత్తమ్ కంప్లీట్ అయిపోవడంతో డైరెక్టర్ మురుగదాస్ చాలా కేర్ ఫుల్ గ ట్రైలర్ ని కట్ చేయిస్తున్నాడట.స్టార్ కాస్టింగ్ తెలిసేలా. కథ గురించి చిన్న క్లూ ఇస్తూ, గ్రాండియర్ ని కూడా ఎలివేట్ చేసేలా ఇది ఉండబోతుంది అని టాక్. రెండుభాషల్లో రాబోతున్న స్పైడర్ పెద్ద సంచలనమే క్రియేట్ చేసేలా ఉంది.

Categories: గాసిప్స్

Tags: ,,,,

Leave A Reply

Your email address will not be published.