‘యుద్ధం శరణం’ మూవీ జెన్యూన్ రివ్యూ

yudham review (1)

యుద్ధం శరణం రివ్యూ:

విడుదల తేదీ: 08/సెప్టెంబర్/2017
దర్శకత్వం: కృష్ణ మరి ముత్తు
నిర్మాత: సాయి కొర్రపాటి
సంగీతం: వివేక్ సాగర్
నటి నటులు: నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్

‘యుద్ధం శరణం’. ఈ టైటిల్ వినగానే ఒక బీభత్సమైన ఇంటెన్సిటీ కనెక్ట్ అవుతుంది. ఇది ఒక సినిమాకి పెట్టడంతో దాంట్లో ఆ రేంజ్ కథగాని, మెచూర్డ్ మైండ్ గేమ్ గాని ఉంటుందేమోనని ఫీలింగ్ కలుగుతుంది. దాంట్లో హీరో నాగ చైతన్య అనగానే కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న చైతు కచ్చితంగా మళ్ళి హిట్ కొడతాడనే సంకేతాలు కనిపించాయి. ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం సినిమా ఎలా ఉందొ.

కథ:

ఇక కథ విషయానికి వస్తే ఫ్యామిలీతో హాయిగా, హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్న యంగ్ బాయ్ అర్జున్ కి డ్రోన్ మేకింగ్ తో అద్భుతాలు చేయాలనీ కోరిక ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా మంచి సపోర్ట్ ఇస్తారు. ఆలా హాయిగా జీవితం గడిపేస్తున్న అర్జున్ కి, అంజలి ఎదురవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అర్జున్ ఇచ్చిన సిగ్నల్ కి, అతని బిహేవియర్ కి ఆమె కూడా ఫ్లాట్ అవుతుంది. ఇలా అల్ ఇస్ వెల్ అనుకుంటున్నా సమయం లో గుడికి వెళ్ళినప్పుడు అర్జున్ పేరెంట్స్ మిస్ అవుతారు. తర్వాత వాళ్ళు ఆక్సిడెంట్ లో చనిపోయారని కేసు క్లోజ్ చేస్తారు.. అసలు అర్జున్ పేరెంట్స్ ఎలా చనిపోయారు?. వాళ్ళ హత్యకి గల కారణాలు ఏంటి?. అసలు విలన్ కి అర్జున్ ఫ్యామిలీ కి సంభంధం ఏంటి?. ఎలాంటి పరిస్థితుల్లో అర్జున్ యుద్ధం శరణం అనాల్సి వచ్చింది?. చివరికి ఆ పద్య వ్యూహాన్ని ఎలా ఛేదించాడు అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

కథ పరంగా చాల ఓల్డ్ ఫార్మాట్ లో ఉన్న ఈ సినిమా మంచి ఎమోషన్స్, సబ్ట్లే కామెడీ మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ నీట్ గా న్యారేట్ చేసాడు డైరెక్టర్ కృష్ణ మరిమూర్తి. ఫస్ట్ హాఫ్ ని ఇంత నీట్ గా డైరెక్ట్ చేసిన ఈ కొత్త డీబడెంట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి రొటీన్ కి వచ్చేసాడు. విలన్ని ఎంత ఎలివేట్ చేస్తే అథ స్ట్రాంగ్ గా హీరో కనిపిస్తాడు అన్న ప్రైమరీ వాల్యూఏ ని పక్కన పెట్టేసాడు. బ్రెయిన్ గేమ్ ని కూడా చాల ఊహాజనితంగా అల్లుకున్నాడు. టైటిల్ లోను, ఫస్ట్ హాఫ్ లోను ఫ్రెష్ నెస్ కనిపించిన డ్రోన్ బ్యాక్ డ్రాప్ ని సెకండ్ హాఫ్ లో చాల సిల్లీ గా వాడుకున్నాడు. ఇక క్లైమాక్స్  కూడా అదేవిధంగా ఉంటుంది. కాకపోతే మురళి శర్మ క్యారెక్టర్ వాళ్ళ చిన్న వేవ్ జనరేట్ అవుతుంది.

ఈ సినిమాలో మేజర్ అసెట్ నాగ చైతన్య, డైరెక్టర్ క్లాస్మెట్ కావడం వల్ల అర్జున్ క్యారెక్టర్ ని బాగా ఎక్కిస్తే దాన్ని అర్ధం చేసుకొని ఆన్ ది టైం పెర్ఫర్మ్ చేసాడు. ఇక ఈ సినిమా లో.. మళ్ళి విలన్ గా టర్న్ తీసుకొన్న శ్రీకాంత్ గెట్ అప్ లో ఉన్నక్రుయాలిటీ  యాక్టింగ్ లో పెద్దగా అనిపించలేదు. సో సో గా సాగిపింది విలన్ పాత్ర . ఇక రావు రమేష్, రేవతి లు తమ సిన్సిర్టీ  తో ఫస్ట్ హాఫ్ కంటెంట్ ఎలివేట్ చేసారు. ఇప్పటివరకు ట్రెడిషినల్ గా ఒక యాంగిల్ చూపించిన లావణ్య త్రిపాఠి ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ గ్లామర్ రోల్ చేస్తా అంటూ హింట్ ఇచ్చింది. టెక్నీషియన్స్ లో డి ఓ పీ నికేత్ బన్నీ , టాప్ క్లాస్ విసుఅల్స్ ఇచ్చాడు మ్యూజిక్ వివేక్ సాగర్ తో సోల్ ఫుల్ సాంగ్స్ తో సినిమా కలర్ ని సేవ్ చేసి ఫలవౌర్ ని యస్ ఇట్ ఐస్ ప్రెసెంట్ చేసాడు వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు ఓవరాల్ గా చూస్తే ట్రైలర్ లో రొటీన్ స్టఫ్ అని క్లూస్ ఇచ్చి , స్క్రీన్ ప్లే మేజిక్ తో కొత్తదనం చూపిస్తారనుకున్నారు అంతా. ఫస్ట్ హాఫ్ వరకు అలానే నడిపించి , సెకండ్ హాఫ్ నుండి రిలాక్స్ అయ్యాడు డైరెక్టర్ టైటిల్ జస్టిఫికేషన్ వరకు బాగానే అనిపించినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో వేచి చూడాలి ఈ వీక్ ఎండ్ లో మీ ఛాయస్ యుద్ధం శరణం అయితే వాచ్ ఇన్ థియేటర్స్ కిల్ పైరసీ సేవ్ సినిమా.

Categories: రివ్యూ

Tags: ,,

Leave A Reply

Your email address will not be published.